వెబ్‌సైట్ డెవలప్ చేస్తానని..
Published Mon, Aug 22 2016 6:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
వెబ్‌సైట్ డెవలప్ చేస్తానని చెప్పిన ఓ ఘనుడు ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ యజమానిని నమ్మించి అతని సెల్‌ఫోన్‌తో ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ఐఏఎస్ కాలనీకి చెందిన మహమద్ మౌజం(26) స్కూల్ బిజినెస్ సొల్యుషన్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థను ఈ నెల 13న ప్రారంభించాడు. సంస్థకు సంబంధించి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను తయారుచేస్తానంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి జస్ట్ డయల్ ద్వారా సంప్రదించాడు. దీంతో ఇద్దరు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10సిలోని ఓ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. కాసేపు ఈ కామర్స్ గురించి మాట్లాడిన శ్రీనివాస్ మౌజంను నమ్మించి తన ఫోన్ స్విచ్చాఫ్ ఉందని చెప్పి మౌజం సెల్‌ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్లిన అతను అలానే ఉడాయించాడు. ఇది గుర్తించిన మౌజం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన నెక్సాస్ 5ఎక్స్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడ సీసీ ఫుటేజీని సేకరించి విచారిస్తున్నారు.
Advertisement