ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం..కాచవానిసింగారం ముత్వేలిగూడకు చెందిన దశరథ్ కుమార్తె సాయి కీర్తన(24)నకు ఐదేళ్ల్ల క్రితం రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉంది. 10 రోజుల క్రితం భార్య భర్తలకు గొడవ జరగడంతో పుట్టిలైన ముత్వేలి గూడకు వచ్చింది. ఈక్రమంలో జూలై 29వతేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో సోమ వారం తండ్రి దశరథ్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మేడిపల్లిలో వివాహిత అదృశ్యం
Published Mon, Aug 1 2016 7:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement