- రూ.56 లక్షలు స్వాధీనం
నాచారం
ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండటమే కాకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న నిందితులను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ. 56 లక్షల నగదు, రూ. 9కోట్ల విలువ గల 150 చెక్స్, 93 సేల్ డీడ్‌స, 2 సెల్ ఫోన్‌లను స్వాథీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై గురువారం అల్వాల్ డీసీపీ రాంచందర్ తెలిపిన వివరాలివీ.. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఎ. విజయ్ కుమారుడు శ్రీనివాస్(49) పైనాన్‌స వ్యాపారం చేస్తూ హబ్సిగూడలోని సాయి ఎన్‌క్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ అధిక వడ్డీలకు చిరువ్యాపారులకు, వివిధ రంగాల డిస్టిబ్యూటర్లకు పైనాన్‌స చేస్తుంటాడు. శ్రీనివాస్ చిరు వ్యాపారులకు, డిస్టిబ్యూటర్లకు ఫైనాన్‌స ఇస్తామని దిన పత్రికల్లో ప్రకటనలుఘిచ్చారు. శ్రీనివాస్ తన ఫైనాన్‌స కలెక్షన్ ఏజెంట్లుగా రాం నగర్‌కు చెందిన వీరేశం(59), కృష్ణ మూర్తిలను పెట్టుకున్నాడు. పత్రికల్లో ప్రకటనలు చూసి ఉప్పల్‌కు చెందిన పార్లీ డిస్టిబ్యూటర్ సంతోష్ , రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద మొదట 6 శాతం వడ్డీకి ఫైనాన్‌స తీసుకున్నారు. అలా సంతోష్, రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద రూ. 30 లక్షలు, రవిందర్ రూ. 90లక్షలు శ్రీనివాస్ వద్ద ఫైనాన్‌స తీసుకున్నారు. శ్రీనివాస్ చివరకు వారి వద్ద 20 శాతం వడ్డీ వసూలు చేశాడు. శ్రీనివాస్ పైనాన్‌స ఇచ్చే సమయంలో చెక్‌లు, బాండ్లు, సేల్ డీడ్‌లు, తనక పెట్టుకుని ఇచ్చేవాడు. వడ్డీ చెల్లించకుంటే బెదరింపులకు పాల్పడటమే కాకుండా ఆస్తులు జప్తు చేసుకునేవాడు. శ్రీనివాస్ వేధింపులు భరించలేక సంతోష్, రవిందర్ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులతో దర్యాప్తు చేపట్టి బుధవారం సాయంత్రం ఫైనాన్‌స వ్యాపారి శ్రీనివాస్, కలెక్షన్ ఏజెంట్ వీరేశంలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 56,20,000 నగదు, రూ. 9,26, 24,000 విలువ గల వివిధ బ్యాంకులకు చెందిన 150 చెక్‌లు, 93 సేల్ డీడ్‌స, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ పై ఐపిసి సెక్షన్ 3, 5, 8, 10, 13, మనీ లాండరింగ్ చట్టం 1349 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వడ్డీ వ్యాపారుల అరెస్టు..
Published Thu, Sep 8 2016 8:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement