Ramchandar
-
ప్రమాద రహిత రైల్వేలు కలేనా?
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డౌన్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. రైల్వేవారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ, చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్‌రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా మానవ వనరుల కొరత సంగతీ వెలుగులోకి వస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను దాదాపు ఇరవై వేలు ఏళ్లతరబడి నింపకుండా వదిలేశారు. ఈ మానవ వనరుల కొరత... రైలు డ్రైవర్లు ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారితీస్తోంది. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్)ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం కేవలం 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్‌లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70 వేల కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుతోపాటు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.నాణ్యతతో కూడిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు వారు, రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చే సి; దాని సూచనలతో కఠినమైన భద్రతా నియమ నిబంధనలు రూపొందించాలి.వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. రైల్వేలోని అన్ని విభాగాలలో ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయాలి. ఆధునిక అత్యంత సాంకేతికతతో వేగంగా నడిచే ‘వందే భారత్’ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణ పరిస్థితులు కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ప్రయాణికులకు ఒక భరోసా కలుగుతుంది. – దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్ -
వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా..
సాక్షి, ఆదిలాబాద్: వివాహం కావడంలేదని మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన పందిరి లింగన్న, పోశాని దంపతుల కుమారుడు రాంచందర్ (32)పెళ్లి సంబంధాలు కుదరడంలేదని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో బయటకు వెళ్లి గ్రామ శివారులోని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
TS Crime News: నిందితులను గుర్తిస్తే.. వెంటనే ఈ నంబర్‌కి..! : మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్
వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం జరిగిన విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగి నాముతాబాజీ రాంచందర్(65) హత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ టి. నరేష్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కరీమాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు నిందితులు బైక్‌పై పరారీ అవుతున్నట్లు కనిపించింది. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి.. రాంచందర్‌ను హత్య చేసిన నిందితులు బైక్‌పై పరారవుతున్న ఫొటోలను విడుదల చేశామని, ఎవరైనా నిందితులను గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే తమకు సమాచారం అందించాలని మిల్స్కానీ ఇన్స్పెక్టర్ టీ. సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు నిందితులు హీరో ఫ్యాషన్ బైక్‌పై పరారవుతున్న ఫొటోలను శుక్రవారం విడుదల చేశారు. నిందితులను గుర్తించిన వారు వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712685119, ఐటీ సెల్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685159, టాస్క్‌ఫోర్స్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685150, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నంబర్ 8712685006 సమాచారం అందజేయాలని కోరారు. -
మూఢనమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు...
సాక్షి, హైదరాబాద్: మంత్రి మండలి సిఫార్సు మేరకు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది కొమిరెడ్డి రాంచందర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు కేసీఆర్ వెల్లడించలేదని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రద్దు జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనాల ఆధారంగా కాకుండా మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రాలపై ఉన్న నమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు సీఎం వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయానికి ముందు ఆయన అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోలేదు. మం త్రి మండలి ఉమ్మడి నిర్ణయం కూడా కాదు. కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుని నిబంధనల ప్రకారం ఆమోదం కోసం ఏదో మొక్కుబడి మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. 6వ నంబర్‌పై ఉన్న నమ్మకం కొద్దీ మంత్రి మండలి సమావేశాన్ని సెప్టెం బర్ 6న నిర్వహించారు. 105 మందికి టికెట్లు ప్రకటించారు. శాసనసభ రద్దు విషయంలో గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. పరిస్థితుల ను బట్టి రాష్ట్రపతి పాలనకు సైతం గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. లోక్‌సభ ఎన్నికలు 2019 మేలో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుపై పునరాలోచన చేయాలని గవర్నర్ మంత్రి మండలిని కోరి ఉండొ చ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం హడావుడిగా తయారు చేస్తోంది. అర్హులైన చాలా మందికి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించం డి’ అని కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు. -
వడ్డీ వ్యాపారుల అరెస్టు..
- రూ.56 లక్షలు స్వాధీనం నాచారం ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండటమే కాకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న నిందితులను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ. 56 లక్షల నగదు, రూ. 9కోట్ల విలువ గల 150 చెక్స్, 93 సేల్ డీడ్స, 2 సెల్ ఫోన్లను స్వాథీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై గురువారం అల్వాల్ డీసీపీ రాంచందర్ తెలిపిన వివరాలివీ.. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఎ. విజయ్ కుమారుడు శ్రీనివాస్(49) పైనాన్స వ్యాపారం చేస్తూ హబ్సిగూడలోని సాయి ఎన్క్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ అధిక వడ్డీలకు చిరువ్యాపారులకు, వివిధ రంగాల డిస్టిబ్యూటర్లకు పైనాన్స చేస్తుంటాడు. శ్రీనివాస్ చిరు వ్యాపారులకు, డిస్టిబ్యూటర్లకు ఫైనాన్స ఇస్తామని దిన పత్రికల్లో ప్రకటనలుఘిచ్చారు. శ్రీనివాస్ తన ఫైనాన్స కలెక్షన్ ఏజెంట్లుగా రాం నగర్‌కు చెందిన వీరేశం(59), కృష్ణ మూర్తిలను పెట్టుకున్నాడు. పత్రికల్లో ప్రకటనలు చూసి ఉప్పల్‌కు చెందిన పార్లీ డిస్టిబ్యూటర్ సంతోష్ , రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద మొదట 6 శాతం వడ్డీకి ఫైనాన్స తీసుకున్నారు. అలా సంతోష్, రవిందర్‌లు శ్రీనివాస్ వద్ద రూ. 30 లక్షలు, రవిందర్ రూ. 90లక్షలు శ్రీనివాస్ వద్ద ఫైనాన్స తీసుకున్నారు. శ్రీనివాస్ చివరకు వారి వద్ద 20 శాతం వడ్డీ వసూలు చేశాడు. శ్రీనివాస్ పైనాన్స ఇచ్చే సమయంలో చెక్‌లు, బాండ్లు, సేల్ డీడ్లు, తనక పెట్టుకుని ఇచ్చేవాడు. వడ్డీ చెల్లించకుంటే బెదరింపులకు పాల్పడటమే కాకుండా ఆస్తులు జప్తు చేసుకునేవాడు. శ్రీనివాస్ వేధింపులు భరించలేక సంతోష్, రవిందర్ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులతో దర్యాప్తు చేపట్టి బుధవారం సాయంత్రం ఫైనాన్స వ్యాపారి శ్రీనివాస్, కలెక్షన్ ఏజెంట్ వీరేశంలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 56,20,000 నగదు, రూ. 9,26, 24,000 విలువ గల వివిధ బ్యాంకులకు చెందిన 150 చెక్‌లు, 93 సేల్ డీడ్స, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ పై ఐపిసి సెక్షన్ 3, 5, 8, 10, 13, మనీ లాండరింగ్ చట్టం 1349 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.