-మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం.
హైదరాబాద్‌సిటీ
నగరంలో పలు చోట్ల ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగలను ఇద్దరిని నారాయణగూడ క్రై మ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని బుధవారం వారిని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా క్రై మ్‌ఇన్‌స్పెక్టర్ గవిడి రాంబాబు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అలియాస్ కుమార్(30), శ్రీనివాస్ అలియాస్ శీనా(32)లు జూన్ విద్యా సంవత్సరం ప్రారంభమైయ్యే సమయంలో నగరానికి చేరుకుని పలు హాస్టళ్లలోకి వేకువజామున చొరబడి ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్నారు.
తాగాజా అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామ్‌సంగ్ జె-7, నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో మూడు ల్యాప్‌టాప్‌లను దొంగలించారు. వీరిని గుర్తించేందుకు సిబ్బంది గాలిస్తున్న తరుణంలో సాయిదత్తా హాస్టల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న విషయాన్ని డిఎసై ్స కష్ణయ్య గుర్తించారన్నారు. సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం జరిగిందన్నారు. అనంతరం విచారణలో ల్యాప్‌టాప్‌లను దొంగలించింది వీరేనని తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచనట్లు రాంబాబు చెప్పారు. ల్యాప్‌టాప్ దొంగలను పట్టుకున్న డిఐ రాంబాబు, డిఎస్సై కష్ణయ్య సిబ్బందిని అబిడ్స్ ఏసిపి జె.రాఘవేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.