interstate thieves
-
‘ఆ తుపాకీని రాజస్తాన్‌లో కొన్నారు’
సాక్షి, హైదరాబాద్: శంకర్ పల్లి, ఆర్సీపురంలో దొంగల ముఠా ఒకటి ఆయుధాలు వాడి కన్స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీలను బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డ సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్సీ పురం, శంకర్పల్లి ఘటనలతో అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలోకి వచ్చారని భావించి టీమ్స్ ఏర్పాటు చేశాము. ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశాం. వారితో పాటు దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశాం. వీరిలో మనీష్ అనే ఓ ఎలక్ట్రికల్ షాప్ ఓనర్‌తో పాటు, స్క్రాప్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారి దగ్గర నుంచి సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. 9,50,000 రూపాయల నగదు సీజ్ చేశాం. ఇందులో ప్రధాన నందితులైన యూపీ రాజస్తాన్‌కు చెందిన 11 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు సజ్జనార్. (చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు) ఇక ‘నిందితులంతా ఎలక్ట్రిషన్స్.. వీరందరూ ఢిల్లీలో పని చేసినపుడు కలుసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలో పని చేశారు. కొల్లూరులో దొంగతనం చేశాక ఆ మెటీరియల్‌ను మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేశారు. వచ్చిన డబ్బులను జల్సాలకు వాడేవారు. దొంగతనం చేయడానికి వర్క్ కావాలనే సాకుతో సైట్లోకి వెళ్లి రెక్కి నిర్వహించేవారు. ఒకరు వర్క్ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు అక్కడ పరిసరాలను గమనించేవారు. ఈ ముఠా రాత్రి 11 నుంచి 3 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడేవారు. ఎంసీబీ ప్యానెల్ బోర్డ్లను చోరి చేసేవారు.. వాటిని మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేవారు’ అని సజ్జనార్ తెలిపారు. (చదవండి: మోస్ట్ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు) ఇక మూడు రోజుల క్రితం మాకు ఓ స్పెసిఫిక్ కేసు వచ్చింది...ఇంతకు ముందు ఆర్సీపురం, శంకర్ పల్లి, ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. ఎట్టకేలకు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశాము. ఇందులో రాజస్తాన్‌కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించాము. ఇన్ఫ్రా కంపెనీలు సెక్యూరిటీ పెంచుకోవాలి. అంతర్గతంగా విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలారాలను ఏర్పాటు చేసుకోవాలి..అరెస్ట్ అయిన వారందరిపై పీడి యాక్ట్ పెడతాం. దొంగతనాలు చేసేటప్పుడు బెదిరించటానికి వాడిన తుపాకిని రాజస్తాన్‌లో కొన్నారు’ అని తెలిపారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
సాక్షి, తిరుపతి: ఐపీఎస్ అధికారినంటూ నగదు వసూలు చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ముస్తాక్ అలియాస్ దిలిహీముస్తాక్ను క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహ్మద్‌ముస్తాక్ తాను హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్నానని ప్రజలను నమ్మించేవాడు. తన కు రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో మంచి పరిచయాలు ఉన్నాయని, కావాల్సిన వారికి ఇసుక క్వారీలు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.39 లక్షల వరకు మోసాలకు పాల్పడ్డాడు. 2013లో శ్రీకాళహస్తికి చెందిన వహీదాను వివాహం చేసుకున్నాడు. ఈమె కోసం హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చే సమయంలో స్థానిక రైల్వే స్టేషన్లో విజయా డెయిరీ నడుపుతున్న లీలావతి దేవితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ద్వారా డ్వాక్రా సభ్యులు మునిరాజమ్మ, భాను, యశోద, జయలక్ష్మి, హేమలత, నాగరాజు, మధును పరిచయం చేసుకున్నాడు. టీటీడీ ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీ లు ఇప్పిస్తామని నమ్మించి వారివద్ద నుంచి రూ.39 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 845 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి, రూ.12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పాత నేరస్తులు అరెస్టు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే దాము, సయ్యద్ అబ్దులాకరీమ్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి పరిసరాల్లో జరిగిన 30 పైగా కేసుల్లో వీరు నిందితులని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 173 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
క్రాంతివీర్... కిడ్నాపర్!
సాక్షి, సిటీబ్యూరో: ఆ ఇద్దరూ రెండు నెలల్లో నగరంలో చిక్కిన అంతరాష్ట్ర నేరగాళ్లు... ఒకరు జూన్‌లో చిక్కిన హర్యానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా కాగా... మరొకరు ఇటీవల పట్టుబడిన ‘స్టార్ చోర్’ శర్థక్ రావు బబ్రాస్... వీరిద్దరిలోనూ ఉన్న ‘కొత్త కోణాలు’ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘరానా గ్యాంగ్‌స్టర్ నెహ్రా తానో విప్లవ నాయకుడిని అంటూ అక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులకు ఊదరగొడుతున్నాడు. మరోపక్క చోరీలు, స్టార్ హోటళ్ల బిల్లులు ఎగ్గొట్టే నేరాలకే పరిమితం అనుకున్న శర్థక్ గతంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులోనూ నిందితుడిగా తేలింది. నేను క్రాంతివీర్... నాది సమాజసేవ... సైబరాబాద్, మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో హర్యానా ఎస్టీఎఫ్ పోలీసులకు గత నెల మొదటి వారంలో చిక్కిన మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న ఇతను బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టని విషయం తెలిసిందే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకునేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గంగోత్రి, బెంగళూరు, హరిద్వార్, పుణే, హుగ్లీల్లో తలదాచుకుని చివరకు నగరంలో చిక్కాడు. ఇక్కడ ఉంటూనే చండీఘడ్‌లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. ఇతడిని అరెస్టు చేసిన తర్వాత హర్యానా ఎస్టీఎఫ్ అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే తానో క్రాంతివీర్ (విప్లవ నాయకుడు) అని, తానే చేసేది సమాజ సేవ అంటూ చెప్పుకొచ్చాడు. తాను చేసినవి నేరాలంటే అస్సలు ఒప్పకోవడం లేదు. ఇతడిని నేరబాట పట్టించిన లారెన్స్ బిష్ణోయ్ చేసిన బ్రెయిన్ వాష్ కారణంగానే సంపత్ ఇలా మారిపోయి ఉంటాడని ఎస్టీఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఇతడికి లండన్ నుంచీ నిధులు అందినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. దీనిపై విచారణ జరపడానికి మరోసారి సిటీకి రావాలని భావిస్తోంది. మైనర్ కిడ్నాప్... కాటేజ్‌లో మకాం... అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చి దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో తన పంజా విసిరిన శర్థక్ రావు బబ్రాస్ను గోపాలపురం పోలీసులు గత వారం అరెస్టు చేశారు. బసేర హోటల్లో బస చేసి, అమర్సన్స్ పెరŠల్స్ అండ్ జ్యువెల్స్ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై కటకటాల్లోకి పంపారు. పోర్ట్ బ్లేయర్లోని ఎంజీ రోడ్ ప్రాంతానికి చెందిన శర్థక్ రావు బబ్రాస్ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. 2014లో ఇతడిపై పోర్ట్ బ్లేయర్లోని ఫహ్రాగావ్ పోలీసుస్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఇతను ఆమెను అపహరించుకు వెళ్లి అక్కడి బునియదాబాద్లోని కృష్ణ కాంటినెంటల్ కాటేజ్‌లో ఉంచాడు. అప్పట్లో ఆ బాలికతో తాను ఇండియన్ నేవీలో ఉన్నతాధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఉత్తరాదికి మకాం మార్చి స్టార్ హోటల్స్‌కు టోకరా వేయడం కొనసాగించాడు. 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా అన్ని కేసుల్లోనూ జైలు శిక్షలు సైతం పూర్తి చేసుకున్నాడు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు
గుత్తి: గుత్తి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ. 12 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ ప్రభాకర్‌గౌడ్‌లు తెలిపారు. గత యేడాది కాలంగా అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో తరుచూ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో అనంతపురం ఎస్పీ అశోక్ కుమార్ అఫెండర్స్ సర్వ్లైన్స్ సిస్టమ్ (పాత నేరస్తుల నిఘా కార్యక్రమం) ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా గతంలో బైక్ చోరీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటి అఫెండర్స్ ఎవరు? అనే విషయాలను ఆరా తీశారు. ఈ క్రమంలో గుత్తిలో గత మూడు మాసాల్లో 8 బైక్‌లు చోరీకి గురయ్యాయి. నిఘా కార్యక్రమం ఆధారంగా గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్ బైక్ దొంగలను పసిగట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అంతరాష్ట్ర బైక్ దొంగల గుట్టు రట్టైంది. గుత్తి మండలం ఊబిచెర్లకు చెందిన బాచుపల్లి రామకృష్ణ, చండ్రపల్లి సుంకన్నలు పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించారు.గుత్తిలో 8 బైక్‌లు, తాడిపత్రిలో 5, డోన్‌లో 1, పత్తికొండలో 1, వజ్రకరూర్‌లో 1, యాడికిలో 1, అనంతపురంలో 5, కడపలో 2 బైక్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే రాజు అనే మరోదొంగ పరారైనట్లు చెప్పారు. బైక్ దొంగలను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్ఐలు వలిబాషు, యువరాజు, పోలీసు కానిస్టేబుళ్లు మోహన్, గణేష్‌లకు నగదు రివార్డును అందజేశారు. -
చేసేది చోరీలు.. కారులో షికార్లు
నాగోలు: దొంగసొత్తును తాకట్టు పెట్టి... కార్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ తప్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం ... సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన చెరుకు నగేష్ అలియాస్ కార్తిక్(30) 2011 నుంచి తెలుగురాష్టాల్లో 21 చోరీ కేసుల్లో నిందితుడు. విశాఖపట్టణం మునగపాక మండలం చెరుకుకొండ గ్రామానికి చెందిన ఎల్లపు నాగేశ్వరావు అలియాస్ నాగా(29) మణికొండలో నివాసముంటున్నాడు. ఇతను కూడ అనేక చోరీల కేసులో నిందితుడు. జైలుకు కూడా వెళ్లాడు. జైళ్లలో ఉన్నప్పుడే నగేష్, నాగేశ్వరావులకు పరిచయం ఏర్పడింది. 2016 మే నెలలో జైలు నుంచి ఇద్దరూ విడుదల అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ కలసి రాచకొండ పోలీస్ కమిషర్‌రేట్ పరిధిలో 13 దొంగతనాలు, సైబరాబాద్ పరిధిలో రెండు, రాజమండ్రిలో ఆంధ్రాబ్యాంకు చోరీ, చెన్నైలో 2 చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని విశాఖపట్టణం ముత్తూట్, మణప్పురం పైనాన్స్‌లలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులు రూ.5 లక్షలతో స్కోడా కారును కొనుగోలు చేసి జల్సాలకు అలవాటుపడ్డారు. అనుమానాస్పదంగా ఎల్బీనగర్లో కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 200 గ్రాముల బంగారం, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
-మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం. హైదరాబాద్‌సిటీ నగరంలో పలు చోట్ల ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగలను ఇద్దరిని నారాయణగూడ క్రై మ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని బుధవారం వారిని కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా క్రై మ్ఇన్స్పెక్టర్ గవిడి రాంబాబు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అలియాస్ కుమార్(30), శ్రీనివాస్ అలియాస్ శీనా(32)లు జూన్ విద్యా సంవత్సరం ప్రారంభమైయ్యే సమయంలో నగరానికి చేరుకుని పలు హాస్టళ్లలోకి వేకువజామున చొరబడి ల్యాప్‌టాప్‌లను దొంగలిస్తున్నారు. తాగాజా అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామ్‌సంగ్ జె-7, నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్లో మూడు ల్యాప్‌టాప్‌లను దొంగలించారు. వీరిని గుర్తించేందుకు సిబ్బంది గాలిస్తున్న తరుణంలో సాయిదత్తా హాస్టల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న విషయాన్ని డిఎసై ్స కష్ణయ్య గుర్తించారన్నారు. సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం జరిగిందన్నారు. అనంతరం విచారణలో ల్యాప్‌టాప్‌లను దొంగలించింది వీరేనని తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచనట్లు రాంబాబు చెప్పారు. ల్యాప్‌టాప్ దొంగలను పట్టుకున్న డిఐ రాంబాబు, డిఎస్సై కష్ణయ్య సిబ్బందిని అబిడ్స్ ఏసిపి జె.రాఘవేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
మామూలు దొంగలు కాదు!
► ఇద్దరు అంతర్రాష్ట్ర చోరుల అరెస్టు ► ఒకడు దోపిడీలు.. మరొకడు ఇళ్లల్లో దొంగతనాలు ► సుమారు రూ. కోటి ‘సొత్తు’ రికవరీ సాక్షి, సిటీబ్యూరో: ఇద్దరు కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు పగటిపూట ఇళ్లల్లో చోరీలు చేస్తుండగా.. మరొకడు దోపిడీ ముఠా సభ్యుడు. నిందితుల నుంచి దాదాపు రూ. కోటి విలువ చేసే బంగారు నగలు, హోండా బ్రియో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, క్రైమ్స్ ఏసీపీ రాములు నాయక్‌తో కలిసి సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం... మేకను బలిచ్చే ‘అమావాస్య’ దొంగ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన మేకల వెంకటేశ్ అలియాస్ జాకీచాన్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి, ఇతర బంధువుల ప్రభావంతో చోరీల బాట పట్టిన ఇతగాడిపై ఇప్పటివరకు తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 30కి పైగా దోపి డీ కేసులు నమోదయ్యాయి. 2007లో జడ్చర్ల జైలు ఎస్కార్ట్, 2012లో చర్లపల్లి గ్రామ సమీపంలో జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న వెంకటేశ్ బెంగళూరు కు మకాం మార్చాడు. అక్కడ ఓ హోటల్లో పని చే స్తూ పూల నాగేశ్వరరావు, శ్రీను, పెవులు, రమేశ్, దు ర్గా, వాసు, మల్లికార్జున్లతో ముఠాగా ఏర్పడి మళ్లీ దోపిడీలు చేస్తున్నాడు. అమవాస్యకు ముందు రోజు రాత్రి ఈ ముఠా సభ్యులు కలిసి చోరీ చేయబోయే ప్రాంతంపై చర్చించుకునేవారు. ఓ గొర్రెను బలిచ్చేవా రు. అమవాస్య రోజు రాత్రి ఆ ప్రాంతంలో ఇళ్ల తలుపులను పగులగొట్టి పురుషులను తాళ్లతో కట్టేసి మహిళల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లేవారు. నగరానికి వెంకటేశ్ వచ్చాడని తెలుసుకున్న ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి పట్టుకుంది. ఇతడి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, 300 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్‌నంటూ... ఎంబీఏ చదివిన ప్రకాశం జిల్లా వట్టెపాలెం వాసి వంశీకృష్ణ పగటిపూట ఇళ్లలో చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. 2006 నుంచి జంట పోలీసు కమిషనరేట్లలో 29 చోరీలు, విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసుల్లో ఐదుసార్లు పోలీసుల చేతికి చిక్కాడు. 2012 చివర్లో జైలు నుంచి విడుదలైన వంశీ మకాం గుంటూరుకు మార్చాడు. నందనవనం కాలనీలో ఖరీదైన డూప్లెక్స్ భవనాన్ని అద్దెకు తీసుకున్న వంశీ అందరితో ఎన్ఆర్ఐ డాక్టర్‌నని చెప్పుకునేవాడు. గుంటూరు నుంచే విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో చోరీ చేయాలనుకుంటున్న ప్రాంతానికి కారులో వెళ్తాడు. అక్కడ కారును పార్కింగ్ చేసి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, కట్టింగ్ ప్లేయర్‌తో తాళం తెరుస్తాడు. పడకగదిలోకి వెళ్లి అక్కడ దొరికిన తాళపుచెవులతో బీరువా తెరిచి బంగారు నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేస్తాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం వంశీకృష్ణను అరెస్టు చేసింది. రెండు కిలోల 210 గ్రాముల బంగారం, 17,85,000ల విలువైన హోండా బ్రియో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ల్యాప్ టాప్, కెమెరా, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకుం ది. వీటి విలువ మార్కెట్లో 84,85,000ల ఉంటుం దని పోలీసులు చెప్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్: రూ.23 లక్షల సొత్తు స్వాధీనం
చిత్తూరు : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం పట్టుకున్నారు. శనివారం చిత్తూరులో జిల్లా ఎస్పీ జి.శ్రీనివాసులు ... అనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా... చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతోందని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వలపన్ని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, ఒక ఇన్నోవా కారుతోపాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
ఖమ్మం (అశ్వారావుపేట) : ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఓ మహిళను అశ్వారావుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశ్వారావుపేట ఎస్ఐ కొండ్రా శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాత నేరస్తుడు కందుకూరి సోమాచారి గతంలో దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అతనికి అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన సంకా రామలక్ష్మి సత్తుపల్లి సబ్‌జైలులో పరిచయం అయింది. కాగా సోమాచారి బెయిల్‌పై జూలై నెలలో విడుదలయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రామలక్ష్మి ఇంట్లో ఉంటూ అశ్వారావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకు యత్నించసాగాడు. ఈక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆగస్టు నెలలో చోరీకి పాల్పడి అక్కడ నుంచి తొమ్మిదిన్నర కాసుల బంగారు ఆభరణాలు, 2 సెల్ఫోన్లు, ఒక ఎల్సీడీ టీవీ అపహరించాడు. వీటన్నింటిని దాచి ఉంచి శుక్రవారం టీవీని విక్రయించేందుకు అశ్వారావుపేటలో సంచరిస్తుండగా అనుమానం వచ్చి విచారించగా గతంలో తాను చేసిన దొంగతనాలను వెల్లడించాడు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పగలు బైక్ మెకానిక్.. రాత్రిళ్లు చోరీలు
కంచికచర్ల : పగటిపూట ఆటోమొబైల్ మెకానిక్‌లా జీవనం సాగిస్తూ రెక్కీలు నిర్వహించి, రాత్రివేళల్లో దొంతనాలు చేస్తున్న వ్యక్తిని కంచికచర్ల పోలీసులతోపాటు నందిగామ ఐడీ పార్టీకి చెందిన సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అతడినుంచి రూ.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ టి.రాధేష్ మురళీ ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన బత్తుల కిరణ్(27) కొంతకాలంగా నందిగామలోని ఓ మోటార్‌సైకిళ్ల షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడు పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. కంచికచర్లలోని పెద్ద బజార్లో ఈ ఏడాది మార్చి నెలలో శ్రీ రామచంద్రమూర్తి అనే ఉపాధ్యాయుడి ఇంటిలో, హనుమాన్‌పేట, గొట్టుముక్కల రోడ్డులోని పెద్దబజార్లో, నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలో 10 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడని తేలింది. కిరణ్‌పై గతంలో ప్రకాశం జిల్లా అద్దంకి, విజయవాడ, గుంటూరు, ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి అరెస్టయ్యాడు. ఈమేరకు అతడినుంచి రూ.5 లక్షలు విలువచేసే 150 గ్రాముల బంగారం(నాలుగు బంగారు గొలుసులు, ఎనిమిది జతల చెవి జూకాలు, 9 ఉంగరాలు) రెండున్నర కేజీల వెండి(గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, కుంకుమ భరిణెలు), రెండు సెల్ఫోన్లు, ఐ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ రూరల్ సీఐ వై.సత్యకిషోర్ అందించిన సమాచారం మేరకు తన పర్యవేక్షణలో స్థానిక ఎస్ఐ కె. ఈశ్వరరావు ఆధ్వర్యంలో కిరణ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇళ్ల యజమానులు తమ వస్తువులు పోయిన వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గిల్టు వస్తువులు పోతే యజమానులు బంగారు వస్తువులు పోయాయని తప్పుడు సమాచారం అందించటం సరైన విధానం కాదని తెలిపారు. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగలు కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా తిరుగుతోందని తమకు సమాచారం అందినట్లు డీఎస్పీ రాధేష్ మురళి తెలిపారు. బ్యాంకులు, సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని సమీపంలో ఈ ప్రాంతాలు ఉండటంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటి కొనుగోలు అమ్మకాలు జరిపే వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే తమ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు. సిబ్బందికి నగదు పారితోషికం కిరణ్‌ను పట్టుకున్నందుకు నందిగామ డీఎస్పీ రాధేష్‌మురళీ కంచికచర్ల ఎస్ఐ ఈశ్వరరావుకు, ఐడీ పార్టీ ఏఎస్ఐ రామారావు, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు సురేష్, నరేంద్రలకు నగదు రివార్డులు అందజేశారు. -
నెల్లూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నెల్లూరు : రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు లారీలతోపాటు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు వాహనాలను చోరీ చేసి దొంగ పత్రాలతో విక్రయిస్తుంటారని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ శుక్రవారం నెల్లూరులో మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
కృష్ణా : అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన బన్సీ, పవార్ మరికొందరితో కలసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడేవారని చెప్పారు. విజయవాడ నగరం చుట్టుపక్కల నాలుగు దోపిడీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసినట్టు కమిషనర్ తెలిపారు. వీరి నుంచి రూ.10.85లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
ఏడుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం: జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దోపిడిలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నిస్తే చంపడానికి కూడా వెనకాడటలేదు. దాంతో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. దొంగల ఆగడాలను అరికట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 2.13 లక్షల రూపాయలను, 5వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఈస్ట్ సీఐ గిరిధర్‌రావు నేతృత్వంలో ఎస్ఐలు అబ్బన్న, కృష్ణయ్య క్రైం పార్టీ పోలీసు సిబ్బంది శుక్రవారం ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారు నగలు, రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచారు. సీఐ గిరిధర్‌రావు చెప్పిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గిరిధర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీనా, మున్నాసింగ్ బంధువులు. మీనా ఆగ్రా ప్రాంతంలో, మున్నాసింగ్ మధ్యప్రదేశ్‌లో ఉంటూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండేవాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడమేగాక ఆర్టీసి బస్టాండ్, బస్సుల్లో ప్రయాణికులకు చెందిన బ్యాగులను కత్తిరించుకుని తీసుకెళ్లేవారు. ఈస్ట్ పీఎస్ పరిధిలో 9 చోరీలకు పాల్పడ్డారు. వారిద్దరూ రామానుజ సర్కిల్లో తచ్చాడుతుండగా ఆ మార్గంలో వెళుతున్న సీఐ గిరిధర్‌రావు, ఎస్ఐలు అబ్బన్న, కృష్ణయ్య, క్రైం పార్టీ సిబ్బంది శేఖర్, ప్రకాష్, శీను, రషీద్, దేవా, చిన్నా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చోరీల విషయం బయటపడింది. వారు కాజేసిన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ అంతర్రాష్ట్ర నిందితులైన మీనా, మున్నాసింగ్‌ను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ గిరిధర్‌రావు, ఎస్ఐలు, క్రైం పార్టీ పోలీసులను అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు. ఈస్ట్ పరిధిలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీ మోహన్‌రావు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామం జోహర్బట్టి ప్రాంతానికి చెందిన ఎండీ ఫిరోజ్ అలియాస్ ఎండీ రహమాన్ అనే యువకుడు కొంతకాలంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలు చేస్తున్నాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి అభరణాలు అపహరించేవాడు. ఇతనిపై జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, రెండో టౌన్లో నాలుగు కేసులు, మూడో టౌన్ లో ఒక కేసు నమోదై ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో అరెస్టు అయి శిక్ష అనుభవించాడు. మొత్తం ఎనిమిది కేసులలో 30 తులాల బంగారం దొంగతనం చేశాడు. పలు బంగారం దుకాణాల వద్ద నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం నిజామాబాద్ అజాం రోడ్డులో పట్టుకున్నారు. నిందితుడిని నుంచి రూ. 6లక్షల విలువ గల 18 తులాల బంగారు అభరణాలు, 65 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.