అనంతపురం: జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దోపిడిలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నిస్తే చంపడానికి కూడా వెనకాడటలేదు. దాంతో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. దొంగల ఆగడాలను అరికట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఈ చర్యల్లో భాగంగా అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 2.13 లక్షల రూపాయలను, 5వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఏడుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Published Thu, Dec 4 2014 3:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement