పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి చెందిన ఇందుభార్గవి(19), చాంద్ అలీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవటంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణాహాని ఉందని, బంధువుల నుంచి రక్షణ కల్పించాలంటూ మంగళవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. రెండు వర్గాల వారిని పిలిపించి, కౌన్సెలింగ్ చేస్తామని పోలీసులు తెలిపారు.
పోలీసులను ఆశ్ర యించిన ప్రేమజంట
Published Tue, Oct 4 2016 11:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement