సాగర్ లోకి దూకిన ప్రేమజంట: ప్రియుడి మృతి | love couple jumped into hussain sagar, lover dies | Sakshi
Sakshi News home page

సాగర్ లోకి దూకిన ప్రేమజంట: ప్రియుడి మృతి

Published Wed, Mar 2 2016 12:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ట్యాంక్ బండ్ (ఫైల్ ఫొటో) - Sakshi

ట్యాంక్ బండ్ (ఫైల్ ఫొటో)

హైదరాబాద్: సమస్యలు పరిష్కరించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న హైదరాబాద్ నగర వాసులకు హుస్సేన్ సాగర్ అడ్డాగామారిన నేపథ్యంలో లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆత్మహత్యలతోపాటు అసాంఘిక శక్తులకూ అడ్డుకట్టవేసే ప్రయత్నం జరిగింది. అయినాకూడా అక్కడ ఆత్మహత్యోదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు(బుధవారం) ఉదయం కూడా ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందో ప్రేమజంట.

రామ్ గోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాలను బట్టి నగరానికే చెందిన నరేశ్(29) అనే వ్యక్తి తన ప్రేయసితో కలిసి బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్ లోకి దూకాడు. ఇది గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలోఉన్న ప్రేమికురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడంతోపాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించేపనిలోపడ్డారు పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement