
బెంగళూరు: తన టూవీలర్ రిపేర్ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్‌నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండు రోజుల్లోనే స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊకే ఆగిపోవడం జరిగింది.
ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదు. దీంతో కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్.. పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు.
షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్‌లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్‌కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Mohammad Nadeem, 26, set fire to the Ola scooter showroom on disagreement with showroom management in Kalaburagi, Karnataka.
Every day a new crime by Abduls.pic.twitter.com/JLFiPg31hp— Sunanda Roy 👑 (@SaffronSunanda) September 11, 2024