pour petrol
-
స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు
బెంగళూరు: తన టూవీలర్ రిపేర్ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్‌నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండు రోజుల్లోనే స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊకే ఆగిపోవడం జరిగింది.ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదు. దీంతో కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్.. పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు.షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్‌కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Mohammad Nadeem, 26, set fire to the Ola scooter showroom on disagreement with showroom management in Kalaburagi, Karnataka.Every day a new crime by Abduls.pic.twitter.com/JLFiPg31hp— Sunanda Roy 👑 (@SaffronSunanda) September 11, 2024 -
అమ్మానాన్నా.. క్షమించండి
మేడ్చల్ రూరల్: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష క్లియర్ చేయలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్ రాసి ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివాసం ఉండే గంగిశెట్టి సాకేత్ కుమార్ (28) ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న సాకేత్ మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాసినా విజయం సాధించలేదని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ నెల 16న హైదరాబాద్‌లో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తల్లిదండ్రులు, సోదరి, బావతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి మొదటి అంతస్తులోని తన గదిలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం గదిలో చూడగా సాకేత్ కనిపించలేదు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాకేత్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. దీంతో కుటుంబీకులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి గౌడవెళ్లి వద్ద ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. గమ్యం చేరని ప్రయాణానికి ముగింపు సాకేత్ రెండు సూసైడ్నోట్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మానాన్నా.. చెల్లి దయచేసి ఈ జన్మకి నన్ను క్షమించండి. నేను బెంగళూరు వెళ్లాక జీవితం కుదుట పడిందని, కిందటి వారం జీతం కూడా పెరిగి మంచి భవిష్యత్తు ఉందని భావించాను. కానీ నేను యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేయలేదనే బాధ నా మదిలో నుంచి పక్కకి పోవడంలేదు. భావోద్వేగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నా, గమ్యం (ఐఏఎస్) చేరని ప్రయాణానికి ఒక ముగింపు’అంటూ సూసైడ్ నోట్ రాశాడు. మరో సూసైడ్‌నోట్‌లో ‘భయం కారణంగా నేను అనుకున్నది చేయలేకపోతున్నా. కాబట్టి సులువైన మార్గంలో ఇంటిని విడిచిపెట్టాలనుకుంటున్నా. నా కోసం వెతకకండి. నేను అదృష్టవంతుడినైతే నా శరీరం కుళ్లిపోయిన స్థితిలో దొరుకుతుంది’ అని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
భార్య మీద కోపం.. మామకు నిప్పంటించి పరారైన అల్లుడు
కేపీహెచ్‌బీకాలనీ: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అడ్డువచ్చిన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన అత్తకు కూడా గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజుకు చెందిన టి. సాగర్‌రావు, రమా దంపతుల కుమార్తె నీతికకు కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణతో 2017లో ప్రేమ వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి సంసారం సంతోషంగా సాగింది. తరువాత భర్త సాయికృష్ణ భార్య నీతికను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులకు తట్టుకోలేక 2019లో తల్లిదండ్రుల వద్దకు నీతిక వచ్చింది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అప్పటి నుంచి నీతిక తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాయి కృష్ణ పెట్రోల్ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. యాసిడ్ పోసేందుకు వచ్చాడనుకొని భయపడిని నీతిక బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీతిక తండ్రి సాగర్‌రావు... అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సాగర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. అత్త రమ మంటలను చూసి అరవటంతో సాయికృష్ణ పరారయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా రమకు సైతం గాయాలు అయ్యాయి. దీంతో సాగర్ రావు, రమలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సాయి కృష్ణకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి
కందుకూరు రూరల్: మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను 27 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారు. భర్త చెడు వ్యసనాలకు బానిసైనా కూలీనాలి చేసుకొని కుమార్తెతో జీవనం సాగిస్తోందా తల్లి. భార్యపై అనుమానానికి తోడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆ భర్త మృగాడిగా మారాడు. 30 ఏళ్లు కలిసి జీవించిన భార్యను, మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను మానవత్వం మరిచి పెట్రోలు పోసి తగులబెట్టాడు. చికిత్స పొందుతూ కుమార్తె ప్రాణాలు వదలగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డికి అదే గ్రామానికి చెందిన సుశీలతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక (27) మానసిక దివ్యాంగురాలు. శ్రీనివాసులరెడ్డి బేల్దారి పనులు చేస్తుంటాడు. సుశీల గ్రామంలో కూలి పనులకు వెళ్తుంటుంది. బిడ్డ పుట్టిన కొంత కాలం నుంచి భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం కూడా తలెత్తింది. గొడవల కారణంగా శ్రీనివాసరెడ్డి కొన్నాళ్లు భార్య, కూతురిని వదిలి హైదరాబాద్, బెంగళూరు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటుండేవాడు. తిరిగి వచ్చినప్పుడుల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణలకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇలా తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరెడ్డి డబ్బుల కోసం, భార్యపై అనుమానంతో భార్యను, కూతురిని ఇంట్లో పెట్టి తలుపువేసి వెళ్తుంటాడు. ఈ విధంగానే శనివారం కూడా చేశాడు. తిరిగి రాత్రి భార్యతో గొడవపడి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లుంగీతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారించి చుట్టు పక్కల వారు సర్దిచెప్పారు. ఈ గొడవలు రోజు ఉండేవేనని తల్లీ కూతుళ్లు ఇంటి ముందు దోమతెర వేసుకొని నిద్రిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నిద్రపోయేందుకు మిద్దె మీదకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆదివారం తెల్లవారు జామున మిద్దెమీద నుంచి తల్లీ కూతుళ్లపై పోశాడు. నిద్రలో ఉన్న తల్లి ఏదో కారుతుందని మేల్కొనే లోపు మంటలు వచ్చాయి. పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆర్పారు. ఏం జరుగుతుందో తెలియని కూతురు శరీరం 80 శాతం కాలిపోయింది. తల్లి శరీరం 30 శాతం కాలింది. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కుమార్తె ప్రియాంక మృతి చెందింది. కాలిన గాయాలతో తల్లి చికిత్స పొందుతోంది. -
కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు పుట్టడం లేదని భార్యపై కోపంతో ఓ వ్యక్తి కన్న కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ బాలిక శరీరం దాదాపుగా కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కర్నూలు తరలించారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు బాలిక తండ్రిపై కేసు నమోదు చేశారు.అయితే నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.