కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి | Father pour petrol daughter, Set her on Fire at kurnool district | Sakshi
Sakshi News home page

కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి

Published Sat, Dec 14 2013 9:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి

కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు పుట్టడం లేదని భార్యపై కోపంతో ఓ వ్యక్తి కన్న కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ బాలిక శరీరం దాదాపుగా కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కర్నూలు తరలించారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు బాలిక తండ్రిపై కేసు నమోదు చేశారు.అయితే నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement