Kalaburgi
-
స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు
బెంగళూరు: తన టూవీలర్ రిపేర్ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్‌నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండు రోజుల్లోనే స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊకే ఆగిపోవడం జరిగింది.ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదు. దీంతో కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్.. పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు.షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్‌కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Mohammad Nadeem, 26, set fire to the Ola scooter showroom on disagreement with showroom management in Kalaburagi, Karnataka.Every day a new crime by Abduls.pic.twitter.com/JLFiPg31hp— Sunanda Roy 👑 (@SaffronSunanda) September 11, 2024 -
‘పార్టీకి వేయండి.. లేదంటే నా అంత్యక్రియలకైనా రండి’.. ఖర్గే ఎమోషనల్
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఒక వేళ మీరు పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడకపోతే.. మీకోసం నేను పనిచేశానని భావిస్తే కనీసం మీరు నా అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలబురగిలో మల్లికార్జున్ ఖర్గే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కలబురగి నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని కాంగ్రెస్ అధిష్టానం పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఈ తరుణంలో జిల్లాలోని అఫ్జల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసారి మీ ఓటు తప్పితే (కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే) నాకు ఇక్కడ స్థానం లేదని, మీ హృదయాన్ని గెలవలేనని అనుకుంటాను' అని ఖర్గే అన్నారు. మీరు మాకు (కాంగ్రెస్‌కు) ఓటు వేసినా వేయకపోయినా, కలబురగికి నేను మంచి చేశానని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అని కాంగ్రెస్ చీఫ్ కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. నేను రాజకీయాల కోసమే పుట్టాను. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా.. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోనని ఖర్గే స్పష్టం చేశారు. -
కాలేజీకి వెళ్లి కనబడకుండా పోయిన నవ వధువు.. చివరికి!
బెంగళూరు: కాలేజీకి వెళ్లి కనబడకుండాపోయిన నవ వధువు నదిలో శవంగా లభించిన సంఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోటా గ్రామంలో చోటుచేసుకుంది. నావదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి (21) మృతి చెందిన నవ వివాహిత. డిగ్రీ 5వ సెమిస్టర్ చదువుతున్న సృష్టికి ఇటీలే వివాహం జరిగింది. ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న సృష్టి ఈనెల 13న కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు వెదికిన కుటుంబ సభ్యులు మరసటి రోజు మహాగాంవ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇలా ఉండగా శనివారం సృష్టి మృత కురికోటా వంతెన వద్ద నదిలో లభించింది. సృష్టి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ -
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్‌ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
పరువు హత్య: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. యువతి సోదరులు..
రాయచూరు రూరల్: తమ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి సోదరులు పరువు హత్యకు పాల్పడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. అఫ్జల్‌పుర తాలూకా దేవల గాణగాపురలోని ఓ లాడ్జిలో విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్(24)కు అదే ఊరులో డిగ్రీ చదువుతున్న జేవర్గి తాలూకా హుల్లూరుకు చెందిన అమ్మాయితో పరిచయమైంది. ఆరు నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇటీవల ఇళ్లు వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అమ్మాయి పెద్దలు వారి ఆచూకీని కనుగొని ఈ నెల 3న బెంగళూరు నుంచి పిలుచుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి అంటే ఇష్టం లేదని చెప్పాలని ఆమె సోదరులు ఈరప్ప, హులిగప్ప, రాకేష్‌లు చంద్రకాంత్‌పై శతవిధాలుగా ఒత్తిడి తెచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..) అందుకు చంద్రకాంత్ ససేమిరా అనడంతో అతనిని అంతమొందించాలని ప్రణాళిక రచించారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అతనిని లాడ్జిలోనే నిర్బంధించి క్రిమిసంహారక మందును తాపించి గొంతు నులిమి చంపి సమీపంలోని ఇంగళిగి వద్ద పొలంలో మృతదేహాన్ని పడేశారు. సమాచారం అందుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనపరచుకున్న దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి
బెంగళూరు: సాక్షి బెంగళూరు: గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో ఆమెతో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సవలగి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ కారును వేగంగా నడుపుతూ నిద్ర మత్తులో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ దూరంగా ఎగిరిపడింది. ప్రమాదంలో గర్భిణి ఇర్ఫాన్ బేగం(25), రూబియా బేగం(50), అబెదాబీ బేగం(50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్‌అలీ(28), షౌకత్‌అలీ(29) ప్రాణాలు విడిచారు. వీరంతా అలంద్‌కు చెందినవారు. కలబురిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (యువతిపై అత్యాచారం.. నాలుక కోసి చిత్రహింసలు) -
కోవిడ్-19 కేంద్రంలో పందుల విహారం
బెంగళూర్ : కోవిడ్-19 ఆస్పత్రుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కర్ణాటకలోని ఓ కోవిడ్-19 ఆస్పత్రిలో పందులు స్వేచ్ఛగా తిరుగుతున్నా అక్కడున్న సిబ్బంది పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కలబురగిలోని కోవిడ్ ఆస్పత్రిలో ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి బుధవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటినుంచి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ కర్గే స్పందిస్తూ ఆస్పత్రుల నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఆస్పత్రిలో పందుల విహారంపై వీడియో వైరల్ కావడంతో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా దేశంలో తొలి కోవిడ్-19 మరణం కలబురగిలో చోటుచేసుకోవడం గమనార్హం. కరోనా కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఈ వ్యాధి నుంచి దేవుడే మనల్ని కాపాడాలని మంత్రి శ్రీరాములు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. మనమంతా జాగ్రత్తగా ఉండాలి..మీరు పాలక పార్టీ సభ్యులైనా..విపక్ష సభ్యులైనా..సంపన్నులైనా..పేదలైనా..ఈ వైరస్‌కు ఎలాంటి వివక్ష ఉండద’ని శ్రీరాములు ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. శ్రీరాములు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో యడ్యూరప్ప సర్కార్ సామర్ధ్యానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక గతంలో గుల్బర్గాగా పేరొందిన కలబురగిలో ఇప్పటివరకూ 2674 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చదవండి : ఊరట : తగ్గిన మరణాల రేటు -
వాషింగ్ మెషీన్లో ఇరుక్కున్న రెండేళ్ల బాలుడు
రెండేళ్ల బాలుడు ‘వాషింగ్ మెషీన్’లో ఇరుక్కున్న సంఘటన కలబుర్గిలోని విద్యానగరలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను విరగ్గొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాలు....కలబుర్గిలోని విద్యానగరలో నివాసం ఉంటున్న దంపతుల రెండేళ్ల కుమారుడు కుర్చీ సహాయంతో టాప్లోడ్ వాషింగ్ మెషీన్‌పై ఎక్కి అందులోకి దిగి ఏడుపు మొదలు పెట్టాడు. వంటింట్లో ఉన్న తల్లి వచ్చి చూసేసరికి ఆ చిన్నారి వాషింగ్ మెషీన్లో ఇరుక్కొని కనిపించాడు. కాళ్లు మెషీన్లో ఇరుక్కు పోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కుమారుడి పరిస్థితిని చూసి భయంతో ఆమె కేకలు వేయగా పక్కింటి వారు వచ్చి అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను కత్తితో కత్తరించేసి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు దిగిన సమయంలో వాషింగ్ మెషీన్ ఆన్‌లో లేదని, అందువల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని ఘటనా స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు. -
కలబుర్గికి కన్నీటి వీడ్కోలు
కన్నీటి పర్యంతమైన అభిమానులు ధారవాడ(సాక్షి, బళ్లారి) : కర్ణాటక సాహితీ దిగ్గజాల్లో ప్రముఖుడు, పరిశోధకుడు డాక్టర్ మహేశప్ప మడివాళప్ప కలబుర్గికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కలబుర్గి పార్థివ శరీరాన్ని ధారవాడ నగరంలోని కర్ణాటక విశ్వవిద్యాలయ రుద్రభూమిలో కలబుర్గి సమాజం ఆచార, పద్ధతి ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. కలబుర్గికి కడసారి దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం ఉదయం ప్రముఖ వాణిజ్య నగరమైన ధారవాడలోని కళ్యాణనగర్లో ఆయన నివాస గృహం వద్దనే దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో పిస్తోల్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విశేష అభిమానులను కూడగట్టుకున్న కలబుర్గి హత్య యావత్ కర్ణాటక రాష్ట్ర ప్రజలను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. బళ్లారి జిల్లా హంపి కన్నడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కూడా ఆయన కొంత కాలం పని చేశారు. సుదీర్ఘ కాలం అధ్యాపకునిగా, ఇతర పదవులను అలంకరించి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా సాహితీ, పరిశోధన రంగాలకు ఆయన చేసిన సేవలు అపారం. సాహిత్య రంగంలో ఆణిముత్యంగా వెలిగిన కలబుర్గి హత్య కావడంతో ఆయన పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి రెండు రోజులుగా ధారవాడ జనసాగరంగా మారింది. సోమవారం ఉదయం ధారవాడ నగరంలోని విశ్వవిద్యాలయం రుద్రభూమిలో కలబుర్గి పార్థివ శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కలబుర్గి పార్థివ శరీరాన్ని కడసారి వీక్షించేందుకు ప్రముఖ రాజకీయ నేతలు, పలువురు మఠాధీశులతో పాటు విద్యార్థి లోకం తరలివచ్చింది. ఈసందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కలబుర్గిని హత్య చేయడం దారుణమని పలువురు ప్రముఖులు బాధతప్త హృదయాలతో పేర్కొన్నారు. ఒక మంచి వ్యక్తిని, సమాజం కోసం నిరంతరం పరితపించే మహానుభావుడిని దుండుగులు పొట్టన బెట్టుకోవడం ఖండనీయమని, వెంటనే పట్టుకుని కఠిన ంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.