
బెంగళూరు: సాక్షి బెంగళూరు: గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో ఆమెతో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సవలగి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
డ్రైవర్ కారును వేగంగా నడుపుతూ నిద్ర మత్తులో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ దూరంగా ఎగిరిపడింది. ప్రమాదంలో గర్భిణి ఇర్ఫాన్ బేగం(25), రూబియా బేగం(50), అబెదాబీ బేగం(50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్‌అలీ(28), షౌకత్‌అలీ(29) ప్రాణాలు విడిచారు. వీరంతా అలంద్‌కు చెందినవారు. కలబురిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (యువతిపై అత్యాచారం.. నాలుక కోసి చిత్రహింసలు)
Comments
Please login to add a commentAdd a comment