Newly Married Woman Goes Missing, She Found Dead At Kalaburagi - Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లి కనబడకుండా పోయిన నవ వధువు.. చివరికి!

Published Sun, Dec 18 2022 3:31 PM

Newly Married Woman Goes Missing Found Dead At Kalaburagi - Sakshi

బెంగళూరు: కాలేజీకి వెళ్లి కనబడకుండాపోయిన నవ వధువు నదిలో శవంగా లభించిన సంఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోటా గ్రామంలో చోటుచేసుకుంది. నావదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి (21) మృతి చెందిన నవ వివాహిత. డిగ్రీ 5వ సెమిస్టర్‌ చదువుతున్న సృష్టికి ఇటీలే వివాహం జరిగింది. ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న సృష్టి ఈనెల 13న కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు.

ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు వెదికిన కుటుంబ సభ్యులు మరసటి రోజు మహాగాంవ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇలా ఉండగా శనివారం సృష్టి మృత కురికోటా వంతెన వద్ద నదిలో లభించింది. సృష్టి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ

Advertisement
 
Advertisement
 
Advertisement