Rapido
-
ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. -
నెల పాటు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ర్యాపిడో (Rapido) సేవలను 30 రోజుల పాటు నిలిపివేసింది. రిక్షా అసోసియేషన్ల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ర్యాపిడో కంపెనీకి RTO పలుసార్లు నోటీసులు జారీ చేస్తూ.. వస్తున్న ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరింది. కానీ సంస్థ దీనికి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. దాని కార్యకలాపాలలో ఉపయోగించే వాహనాలకు తప్పనిసరి బీమా కూడా అవసరం. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.ర్యాపిడో బైక్ సర్వీస్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్టీఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో సంస్థ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అహ్మదాబాద్ ఆర్టీవో అధికారి 'జేజే పటేల్' (JJ Patel) మాట్లాడుతూ.. ఆర్టీవో కేవలం ర్యాపిడో త్రీ-వీలర్ ఆటో రిక్షాలకు మాత్రమే అగ్రిగేటర్ లైసెన్స్‌ను జారీ చేసింది. కానీ వారు తమ ఆన్లైన్ యాప్ ద్వారా నాన్-ట్రాన్స్పోర్ట్ టూ-వీలర్ వాహనాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు. అంతే కాకుండా డాక్యుమెంట్స్ గడువు ముగిసిన తర్వాత కూడా వారు వాహనాలను నడపడం కొనసాగించారు. దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది. కాబట్టి, మేము 30 రోజుల పాటు రాపిడో సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిబంధలనలు ఉల్లంగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.ర్యాపిడో సేవలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా కొన్ని నియమాలను సంస్థ ఉల్లంఘించిందనే కారణంగా ఢిల్లీ హైకోర్టు ర్యాపిడో సేవలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ ఆర్టీవో ర్యాపిడో సేవలను 30 రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.చాలామంది ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పకుండా, నియమాలను పాటించాలి. అప్పుడే ప్రజలకు సురక్షితమైన సేవలను అందించగలుగుతారు. నియమాలను ఉల్లంగిస్తే.. ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ర్యాపిడో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.ర్యాపిడో సర్వీస్ ఉపయోగాలుదేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడో సేవలను మంచి ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. చాలా మంది ర్యాపిడో బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి వాటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్చాలామందికి ఉపాధిర్యాపిడో సర్వీస్ కారణంగా దేశంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కొక్కరు నెలకు వేలల్లో సంపాదించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ బైక్ సర్వీస్ ద్వారానే నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు ఈ మధ్యకాలంలోనే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే బైక్ నడుపుకుంటూనే చాలామంది మంచి ఆదాయం సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి..
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్‌ఫోన్‌తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్‌లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్‌పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్‌ను కూకట్‌పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు. దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్‌కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ర్యాపిడో ఇక ‘యూనికార్న్’..
దేశంలో ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్-ఈ ఫండింగ్‌లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్ క్లబ్లో చేరింది. ఒక బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.బైక్ ట్యాక్సీ సర్వీస్‌గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్ గుంటుపల్లి, అరవింద్ శంఖ, రుషికేష్‌లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
అవును! పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బైక్ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్ బుక్ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. -
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. ఇకపై క్యాబ్‌ల మాదిరిగానే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. -
ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే..
బైక్ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు. -
ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్స్టేషన్లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్‌లో ‘ఓట్ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం!
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ర్యాపిడోలో రైడ్ బుక్ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మోటార్‌సైకిల్‌పై రావడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. నిషిత్ పటేల్ తన ర్యాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్ హై ఎండ్ మోటార్ సైకిల్‌పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్ పటేల్ షాకయ్యాడు. ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు యూజర్స్ నుంచి లెక్కకుమించిన కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ ‘మీరు అతని సైడ్ బిజినెస్ టర్నోవర్ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్‌ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’ నిషిత్ తెలిపారు. మరో యూజర్ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట! You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital — Nishit Patel (@nishit130) August 5, 2023 -
మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించగా.. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా రూ.52 కోట్లు రాబట్టింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో రిలీజ్ రోజే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ ముందడుగేసింది. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!) తాజాగా ర్యాపిడో సంస్థ రజినీకాంత్‌పై తమ అభిమానాన్ని చాటుకుంది. ముఖ్యమైన నగరాల్లో బైక్, ఆటో ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో సంస్థ తమ డ్రైవర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ర్యాపిడో ఆటో ట్యాక్సీ సేవలు అందించే కెప్టెన్స్ కోసం జైలర్ ప్రత్యేక షో వేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ర్యాపిడో సంస్థ స్వయంగా ప్రకటించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్లో కేవలం వారి కోసమే ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. సంస్థ నిర్ణయంతో 500కు పైగా ర్యాపిడో ఆటో డ్రైవర్లకు తమ అభిమాన హీరో తలైవా జైలర్ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది. సంస్థ నిర్ణయం పట్ల ర్యాపిడో కెప్టెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వారి సేవలను కొనియాడారు. కాగా.. జైలర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ వారి కోసం ప్రత్యేక షో వేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: జైలర్ కోసం జపాన్ నుంచి అభిమానులు) -
బాబోయ్ ఇదేం ప్రయాణం.. నావల్ల కాదు.. ఇలాగైతే కష్టమే!
బెంగుళూరు: వాహనాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే అంతకంటే మరో సౌకర్యం లేదనే స్థితికి చేరుకున్నారు నగరాల్లో నివసించేవారు. కానీ ఆ సౌకర్యంలో అసౌకర్యం కలిగితే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు ఓ బెంగుళూరు వాసి. కేవలం 45 నిముషాల ప్రయాణానికి అతను 225 నిముషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అర్జెంటు పని ఏదైనా ఉండి ఏమాత్రం ఆయాస పడకుండా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్నీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్లో వాహనాన్ని బుక్ చేసుకుని శరీర అలసట లేకుండానే రివ్వున గమ్యస్థానం చేరుకోవచ్చు. వాహనాన్ని బుక్ చేసుకునే సమయంలో కూడా తొందరగా వచ్చే వాహనాలనే ఎంచుకుని మరీ బుక్ చేసుకుంటాము. కానీ బెంగుళూరులో ఓ వ్యక్తికి ఈ ఆన్లైన్ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి. దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు ఈ చోద్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. Rapido wait time getting out of hand. 😭 Gotta wait for more than 3.7 hours for 45 minutes travel. @peakbengaluru #rapido #Bengaluru #peakbengaluru pic.twitter.com/7xPO3cBkPz — deyalla (@deyalla_) August 1, 2023 ఇది కూడా చదవండి: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి.. -
ఉబర్, ర్యాపిడోలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
-
ర్యాపిడో, ఊబర్లకు షాక్.. అప్పటి వరకు సర్వీసులు బంద్!
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బైక్-ట్యాక్సీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ సంస్థలు అందించే సేవలను నిషేదిస్తూ ఢిల్లీ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ర్యాపిడో,ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లగా.. వీటి సర్వీసులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో, ఉబెర్‌లు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్-ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై పరిపాలన ద్వారా తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్లను దేశ రాజధానిలో తమ సర్వీసులు నిలిపివేయాలని తెలిపింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అయితే ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మే 26న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఈ అంశంపై.. జులై ఆఖరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని తమ వాదనను వినిపించగా... జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. చదవండి: Cyclone Biparjoy Updates: అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్జోయ్ -
ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం
హైదరాబాద్: బైక్ ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టినట్లు ఆటో–టెక్ అగ్రిగేటర్ సంస్థ ర్యాపిడో తెలిపింది. ఇందులో భాగంగా రేట్ కార్డును సవరించినట్లు వివరించింది. 8 కిలో మీటర్ల వరకు కిలో మీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీనితో ఇతర ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మరింత ఎక్కువగా ట్యాక్సీ కెప్టెన్లకు ఒక్కో ఆర్డరుకు కనీసం రూ. 60 ఆదాయం లభించగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వివరించారు. మిగతా ప్లాట్‌ఫామ్‌లలో ఇది రూ. 40–45గా ఉన్నట్లు పేర్కొన్నారు. కెప్టెన్లకు ట్రిప్పులపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. అంటే రైడర్లు బుక్ చేసే గమ్యస్థానాల గురించి బైక్ కెప్టెన్లకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. బుకింగ్ క్యాన్సిలేషన్లను తగ్గించడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
తార్‌మార్ తక్కెడ మార్
‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్ తక్కెడ మార్ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ బెంగళూరులో టూ–వీలర్ ర్యాపిడో(బైక్ ట్యాక్సీ సర్వీస్)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్లైన్లు, హసిల్ కల్చర్ గురించి చర్చించారు. ఒక యూజర్ గత నెల వైరల్ అయిన వీడియో పోస్ట్ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కనిపిస్తాడు!! -
రైడ్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ
ఇటీవల ఆన్లైన్లో కారు లేదా బైక్ బుక్ చేసుకుని హాయిగా ఎక్కడికైనా సులభంగా ప్రయాణించేస్తున్నాం. అందులోకి ర్యాపిడో వచ్చాక మరింత ప్రయాణం సులభమైంది. సింగిల్‌గా వెళ్లాలంటే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే చాటు తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రయాణించవచ్చు. ఐతే ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఆన్లైన్లో బైక్ బుక్‌చేసుకుంటే..ఆ ర్యాపిడో డ్రైవర్ నుంచి మహిళ ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ మేరకు ఆమె తనకు ఆ డ్రైవర్‌కు మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్‌ల సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్టిట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..హసన్పరీ అనే మహిళ బైక్ రైడ్‌ని బుక్ చేసుకుంటే..డ్రైవర్ పికప్ చేసుకుని రైడ్ పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మహిళకు పంపిన మెసేజ్‌లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఆ సందేశంలో తాను ఆమె వాయిస్, ఫ్రోఫైల్ ఫోటో చూశాకే పికప్ చేసుకోవడానికి వచ్చానని లేదంటే అసలు పికప్ చేసుకోవడానికి వచ్చే వాడని కాదని చెప్పాడు. దీంతో ఆ ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనకు మండిపడుతూ వెంటనే సదరు కంపెనీకి ఆ వాట్సాప్ సందేశాలను పంపించి మరీ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ర్యాపిడో కేర్ సదరు మహిళకు క్షమాపణలు చెప్పడమే గాక సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అతను తన వృత్తి ధర్మాన్ని పాటించడంలో సరైన విధానం లేకపోవడంతోనే అలా ప్రవర్తిచాడని అని వివరణ ఇచ్చుకుంది. అలాగే ఆ మహిళను తాను బుక్‌చేసుకున్న రైడ్ ఐడిని రిజష్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ చేయండి తక్షణమై సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఐతే నెటిజన్లు మాత్రం ఆమె ధైర్యంగా సదరు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినందుకు మెచ్చుకోవడమే గాక ఈ రోజుల్లో ర్యాషిడో డ్రైవర్లు కూడా సేఫ్ కాదంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ట్వీట్ చేశారు. shared my location with a captain at @rapidobikeapp and this is what i get???? FUCK YOUR APP FUCK YOUR MEN FUCK MEN pic.twitter.com/EHLqd7lpt5 — husnpari (@behurababe) March 12, 2023 (చదవండి: ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు) -
ర్యాపిడోకి ఊహించని షాక్.. అన్ని సర్వీసులు బంద్ చేయాలని కోర్టు అదేశాలు!
ర్యాపిడోకి బాంబే హైకోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. పుణెలో ర్యాపిడో సర్వీస్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడో ట్యాక్సీ సర్వీస్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బైకలతో పాటు కంపెనీకి చెందిన వాహనాలకు లైసెన్స్ లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగింది గతేడాది డిసెంబర్లో ర్యాపిడో లైసెన్స్ దరఖాస్తుని రవాణా శాఖ తిరస్కరించింది. కంపెనీ అప్లికేషన్లో బైక్, ట్యాక్సీలపై మార్గదర్శకాలు స్పష్టంగా లేవని, కనుకు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశంపై ర్యాపిడో కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుకు సంబంధించి ర్యాపిడో తరపు న్యాయవాదులు వాదిస్తూ.. లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వాదించారు. అయితే లైసెన్స్ ప్రక్రియ ఇంకా దరఖాస్తు దశలోనే ఉందని, ప్రస్తుతం ర్యాపిడో కార్యకలపాలు జరపడం చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే శుక్రవారం వరకు ర్యాపిడో తమ అన్నీ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం (జనవరి 20న) కోర్టు మరో సారి దీనిపై విచారణ చేపట్టనుంది. చదవండి: ‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్! -
మద్యం మత్తు తెచ్చిన చేటు...ఇదే అవకాశంగా భావించి...
కొచ్చి: ఒక మహిళ మద్యం మత్తులో ఉండటంతో అఘాయిత్యానికి తెగబడ్డాడు ఒక రాపిడో బైక్ డ్రైవర్. ఈఘటన కేరళలో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....22 ఏళ్ల కేరళ మహిళపై సాముహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడి ఇంటికి వెళ్లిన మహిళ తిరుగు ప్రయాణంలో రైడ్ షేరింగ్ అప్లికేషన్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంది. ఐతే ఆమె ఆ సమయంలో మద్యం మత్తులో ఉంది. ఆమె గమ్యస్థానానికి వచ్చినా దిగే పరిస్థితిలో లేదు. దీంతో దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ డ్రైవర్ ఆ మహిళను తన ఇంటికి తీసుకువెళ్లి తన సహచరుడితో కలసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె స్ప్రుహలోకి రావడంతో తీవ్ర నొప్పికి గురయ్యింది. దీంతో ఆమె నిందితుడి ఇంటి నుంచి బయటపడి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి పోలీసులు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు భాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో బాధితురాలు పశ్చిమ బెంగాల్ చెందిన మహిళ కాగా, నిందితులిద్దరూ బెంగళూరు చెందిన వారని చెప్పారు. (చదవండి: తండ్రికి గుండె నొప్పి వచ్చిందని...కంగారులో కారుని వేగంగా పోనివ్వడంతో...) -
సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం
బెంగళూరు: క్యాబ్ సర్వీసుల సంస్థలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించకుండా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సర్కార్ మూడు రోజుల్లో సేవలను నిలిపివేయాలని ఓలా, ఉబెర్, ర్యాపిడోలను ఆదేశించింది. కర్ణాటక రవాణా శాఖ వాహన అగ్రిగేటర్లకు నోటీసులు జారీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఓలా, ఉబెర్‌లు రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ కనీసం రూ. 100 వసూలు చేస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి అగ్రిగేటర్లు సేవలను నిర్వహిస్తున్నారు. అదనంగా, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టిహెచ్ఎం కుమార్ నోటీసులో పేర్కొన్నారు. ఆటో సర్వీసులను నిలిపివేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీస ఆటో ఛార్జీ మొదటి 2 కి.మీకి రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే క్యాబ్‌లలో ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నోటీసులో సూచించారు. ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని కూడా ఆయన హెచ్చరించారు. -
ర్యాపిడో డ్రైవర్‌గా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి..ప్యాసింజర్‌కు ఊహించని అనుభవం!
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా నలుగురితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ట్రెక్కింగ్, క్యాంపింగ్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము ఉన్నత ఉద్యోగం చేస్తున్నామనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్యాబ్, టూవీలర్లకు డ్రైవర్లుగా మారిపోతున్నారు. బెంగళూరుకు చెందిన నిఖిల్ సేఠ్ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నట్లు తెలిపాడు. ర్యాపిడో బైక్ ఎక్కి వెళుతుండగా..మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌తో మాట కలిపినట్లు చెప్పాడు. మాటల సందర్భంలో తాను (ర్యాపిడో డ్రైవర్) మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నా..ర్యాపిడ్ ఎందుకు చేస్తున్నారు. అని ప్రశ్నించిన నిఖిల్ సేఠ్‌కు సదరు డ్రైవర్ నుంచి ఊహించిన సమాధానం ఎదురైంది. నేను మనుషుల్ని ప్రేమిస్తాను..వస్తువుల్ని వాడుకుంటాను సార్. నాకు మనుషులతో మాట్లాడడం అంటే మహా ఇష్టం. కానీ నేను మాట్లాడేందుకు నా చుట్టు పక్కల మనుషులు లేరు.అందుకే నేను వారితో మాట్లాడేందుకు ఇలా ర్యాపిడో డ్రైవర్‌గా అవతారం ఎత్తినట్లు చెప్పినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఆ ట్విట్‌పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. -
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి 8 మంది కాలేజీ అమ్మాయిలకు మెసెజ్‌ల రూపంలో అర్థ నగ్న ఫోటోలు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. దీంతో విజయ్ కుమార్ అనే ర్యాపిడో డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్టు విజయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. -
ఫోన్లో బుకింగ్.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నేరగాళ్లు లెక్కచేయడం లేదు. ఏకంగా ఫోన్లో గంజాయి ఆర్డర్ తీసుకొని.. ఎంచక్కా ర్యాపిడో బైక్ బుకింగ్ చేసుకొని ఇంటికెళ్లి మరీ సరుకు డెలివరీ చేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రాచకొండ పోలీసులకు చిక్కిన మురుగేశన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా మూడోసారి మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కాడు. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురుగేశన్ కాప్రాలోని శంకరమ్మ కాలనీలో స్థిరపడ్డాడు. ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అవసరాలకు డబ్బులు సరిపడకపోవడంతో అతడు గంజాయి రవాణాను ఎంచుకున్నాడు. ధూల్‌పేటలోని పెడ్లర్ మహేశ్ నుంచి కిలోల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి 10, 15 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా చేసేవాడు. ప్యాకెట్ రూ.400 చొప్పున పేదలు, విద్యార్థులకు విక్రయించేవాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మంగళవారం మురుగేషన్‌ను అరెస్ట్ చేశారు. మహేశ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 1.7 కిలోల గంజాయి (114 ప్యాకెట్లు; ఒక్కో ప్యాకెట్ 15 గ్రాములు), రోలింగ్ పేపర్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ర్యాపిడోలో స్విగ్గీ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బైక్ ట్యాక్సీ వేదిక అయిన ర్యాపిడో తాజాగా రూ.1,370 కోట్ల నిధులను సమీకరించింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సేవల్లో ఉన్న స్విగ్గీ పెట్టుబడి పెట్టడం విశేషం. సిరీస్–డి ఫండింగ్‌లో భాగంగా టీవీఎస్ మోటార్ కంపెనీతోపాటు ఇప్పటికే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వెస్ట్‌బ్రిడ్జ్, షెల్ వెంచర్స్, నెక్సస్ వెంచర్స్ సైతం తాజా రౌండ్లో నిధులను సమకూర్చాయి. సాంకేతికత మెరుగు, సిబ్బంది సంఖ్యను పెంచుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చించ్చనున్నట్టు ర్యాపిడో తెలిపింది. 100కుపైగా నగరాల్లో డ్రైవర్ పార్ట్నర్స్ ఆదాయాలు పెరిగేందుకు, కస్టమర్ల అనుభూతి మెరుగుపర్చడానికి బైక్ ట్యాక్సీ, ఆటో, డెలివరీ విభాగాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు ర్యాపిడో రూ.990 కోట్లు సమీకరించింది. 100కుపైగా నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. 2.5 కోట్ల మంది కస్టమర్లున్నారు. 15 లక్షల మంది డ్రైవర్ పార్ట్‌నర్స్‌తో చేతులు కలిపింది. చదవండి: ఆన్లైన్ గేమింగ్ కోసం.. కేవైసీ ఇవ్వాలి -
ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ తెగ వాడేస్తున్నారా? అయితే, మీకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ వారి వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ డేటాను "తృతీయపక్ష ప్రకటనల" కోసం ఉపయోగిస్తున్నారు. సర్ఫ్ షార్క్ డేటా సెన్సిటివిటీ ఇండెక్స్ అనేది రైడ్-హైలింగ్ యాప్స్ అనేవి వారి వినియోగదారుల నుంచి ఏ రకమైన డేటా సేకరిస్తున్నాయో తెలియజేస్తుంది. గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్'గా నిలిచాయి. వినియోగదారుల నుంచి డేటా సేకరిస్తున్న పరంగా స్వదేశీ రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. వినియోగదారులకు సేవలను అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 3 అంశాల ఆధారంగా ఈ డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ తెలిపింది. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు ఇందులో తేలింది. ఉబెర్, లిఫ్ట్ కలిసి 7వ స్థానంలో నిలిచాయి. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ నిలిచింది. (చదవండి: ప్రపంచంలో మరో వింత.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో) -
ముంబైలో ‘రెంట్ ఏ ట్యాక్సీ’ పథకం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ జఠిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ‘రెంట్ ఏ బైక్’ అనే నూతన విధానాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదన రవాణ శాఖకు పంపించింది. దీనిపై త్వరలో స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎస్టీఏ) సమావేశం ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ అవినాశ్ ఢాకణే తెలిపారు. ముంబైలో జరుగుతున్న మెట్రో పనులు వల్ల గత కొన్ని నెలలుగా రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫలితంగా వాహనాల వేగం మందగించి తరచూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీని ప్రభావం ముంబైకర్ల విలువైన సమయం, వ్యయంపై పడుతోంది. రోడ్లపై ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోల సంఖ్య తగ్గించాలంటే రెంట్ ఏ బైక్ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రైవేటు కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం రెంట్ ఏ బైక్ పథకం యాప్ బేస్డ్ సేవా తరహాలో ఉంటుంది. ఈ బైక్‌ల సేవలు రైల్వే స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకునే విధంగా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరు రోజుల కోసం ఈ బైక్‌లు హెల్మెట్‌తోపాటు అందజేస్తాయి. బైక్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. చదవండి: (ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..) లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట అందుబాటులో ఉన్న రెంట్ ఏ బైక్ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణంగా లోకల్ రైలు దిగిన ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు షేర్ ట్యాక్సీలు, ఆటోలలో తమ కార్యాలయాలకు చేరుకుంటారు. ఆలస్యమైతే లేదా అత్యవసరమైతే సొంతంగా ట్యాక్సీలో లేదా ఆటోలో వెళతారు. దీంతో రోడ్డుపైకి ఎక్కువ వాహనాలు రావడంవల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంవల్ల చార్జీలు కూడా ఎక్కువే అవుతాయి. ఇది మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం కూడా. అదే బైక్‌ను రెంట్‌కు తీసుకుంటే విలువైన సమయం ఆదా కావడంతోపాటు తక్కువ చార్జీలకే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రైవేటు కంపెనీ అంటోంది. అంతేగాకుండా ట్యాక్సీ, యాప్ ఆధారిత ప్రైవేటు ఓలా, ఉబెర్టాంటి ఫోర్ వీలర్స్‌తో పోలిస్తే టూ వీలర్ ప్రయాణం వేగంగా, చార్జీలు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటుందని పేర్కొంది. ‘ర్యాపిడో’ వ్యవహారం ఇంకా తేలలేదు... ఇదిలాఉండగా 2020 ఆగస్టులోనే ర్యాపిడో అనే కంపెనీ ముంబైలో ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ సేవలకు సంబం ధించిన బ్యాడ్జీ, లైసెన్స్ లేకపోవడంతో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) స్పందించలేదు. అనుమతులు లేకుండా ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తే ర్యాపిడో కంపెనీపై, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆర్టీఓ హెచ్చరించింది. దీంతో ఈ పథ కం అటకెక్కింది. అయితే బైక్ టాక్సీ సేవలు కొనసాగుతుండగా, రెంటెడ్ బైక్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అప్పటికే కరోనా కారణంగా ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారు. తరుచూ పెరుగుతున్న సీఎన్జీ ధరలతో చార్జీలు పెంచివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రెంట్ ఏ బైక్ సేవలు ప్రారంభిస్తే ట్యాక్సీ, ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఎస్టీఏ దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఆర్టీఓ అధికారులతో సమగ్ర విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వచ్చే విమర్శలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. -
జనవరి 1 నుంచి ఆటో ఎక్కితే మోత మోగాల్సిందే..!
కొత్త ఏడాదిలో కేంద్రం ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5% జీఎస్టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. వీధులలో తిరిగే ఆటో రైడ్ల మీద ఎలాంటి జీఎస్టీ విధించరు. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ఉబర్, ఓలా, రాపిడో వంటివి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ విషయం మీద తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఏ.సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు వచ్చే బుకింగ్ రైడ్లు తగ్గుతాయని అన్నారు. ఇప్పటికే, ఈ మహమ్మారి వల్ల ఆటోరిక్షాలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షల వల్ల ఆటోలో ప్రయాణీకుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల, ప్రయాణీకుల సమస్యలు మరింత పెరగనున్నట్లు వివరించారు. (చదవండి: ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!) -
ఆర్టీసీని కించపరిచే ప్రకటన తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సును కించపరిచేలా సినీ హీరో అల్లు అర్జున్‌తో ఓ యాప్ ఆధారిత బైక్ టాక్సీ అగ్రిగేటర్ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రదర్శన నుంచి తొలగించాల్సిందిగా నాంపల్లిలోని సిటీసివిల్ కోర్టు ఆదేశించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆ బైక్ టాక్సీ సంస్థ పనితీరు ఉత్తమంగా ఉంటుందని చూపించే క్రమంలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసేలా ప్రచార చిత్రాన్ని రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆర్టీసీ ఎండీ పరువునష్టం దావా హెచ్చరికలతో ఆ సంస్థకు, నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రసారాలను నిలిపివేయకపోవటంతో ఆర్టీసీ నాంపల్లి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సజ్జనార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల అనంతరం స్వల్పంగా ప్రచార చిత్రంలో మార్పు చేసినా.. ఆర్టీసీ బస్సును అలాగే చూపించటాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాన్ని ప్రసారం నుంచి తొలగించాలని, వీడియో అసలు, సవరించిన యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని గూగుల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ని కోర్టు ఆదేశించినట్టు వెల్లడించారు. -
Rapido: కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించంది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. చదవండి: (సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..) -
సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో
-
సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులకు ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. టీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌లో చిత్రీకరించిన సన్నివేశాలను ఆ సంస్థ శనివారం తొలగించింది. కాగా, ఇటీవల అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటన వివాదాస్పదమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: (అల్లు అర్జున్, ర్యాపిడోకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక) -
అల్లు అర్జున్, ర్యాపిడోకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటన సంచలనమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకనట ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్ నిన్న అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సజ్జనార్ దీనిపై మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. చదవండి: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిసులకు సమాధానం రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపరచకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలియజేశారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను పెంచుతామని, నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
Allu Arjun : ర్యాపిడో స్టార్ క్యాంపెయిన్ షురూ
బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడో సెలబ్రిటీ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా రూపొందించిన వీడియోల్లో స్టార్ హీరోలు అల్లు అర్జున్, రణ్‌వీర్‌సింగ్‌లు నటించారు. స్మార్ట్హో తో ర్యాపిడో థీమ్‌తో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాపిడో అందిస్తున్న ఆఫర్లు, యూనిక్ ఫీచర్లను వివరించడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు మార్కెట్‌ను విస్తృతి చేసుకోవడం లక్ష్యంగా ర్యాపిడో ప్రచారం చేపట్టింది. నవంబర్ 5న ఈ సెలబ్రిటీ క్యాంపెయిన్ మొదలైంది. ఆరు వారాల పాటు 14 నగరాల్లో ప్రచారం జరగనుంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక వీడియో యాడ్లకు ఏస్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిజిల్ శ్రీవాస్తవలు దర్శకత్వం వహించారు. వీటిని డ్రీమ్వాల్ట్ మీడియా చిత్రీకరించింది. ర్యాపిడో మార్కెటింగ్ హెడ్ అమిత్ వర్మ మాట్లాడుతూ .. అల్లు అర్జున్, రణవీర్ సింగ్‌లతో సెలబ్రిటీ ప్రచారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ర్యాపిడో ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అల్లు అర్జున్ వెల్లడించారు. 52మిలియన్లు ఫండింగ్ ర్యాపిడో దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో 150,000 నుంచి 160,000 బైక్ సేవల్ని, 26 నగరాల్లో 70వేల ఆటోలు రిక్షా సేవలుల్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ర్యాపిడో సేవల్ని మరింత విస్తరించేందుకు ఇటీవల 52 మిలియన్ల ఫండింగ్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీ అభ్యంతరం ర్యాపిడో యాడ్‌లో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్‌కి నష్టం కలిగేలా అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ర్యాపిడో, హీరో అల్లు అర్జున్‌లకి టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపింది. ప్రజా ప్రయోజనాలకు హానీ కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కోరింది. -
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
-
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
TSRTC Sends Legal Notice to Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. ఈ మేరకు సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. ‘అల్లు అర్జున్ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది... అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’ అని సజ్జనార్ తెలిపారు. -
రాపిడోలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన యమహా కంపెనీ..!
జపనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు యమహా బెంగుళూరుకు చెందిన బైక్ టాక్సీ ప్లాట్‌ఫాం రాపిడోలో భారీగా పెట్టుబడులను పెట్టింది. సుమారు 52 మిలియన్ డాలర్లను (రూ. 385 కోట్లు) ఫండింగ్‌ను యమహా అందించింది. ఈ నిధులను వచ్చే 18 నెలల్లో 50 మిలియన్ల మంది కొత్త వినియోగదారుల కోసం ఉపయోగించాలని రాపిడో యోచిస్తోంది. యమహా అందించిన నిధుల్లో కొంతభాగం అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టడం కోసం, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన చేయడం కోసం రాపిడో ఉయోగించనుంది. రాపిడోలో ఫండింగ్ చేయడం కోసం నిర్వహించిన రౌండ్స్‌లో షెల్ వెంచర్స్, క్రెడ్ వ్యవస్థాపకులు కునాల్ షా, స్పాటిఫై ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్జిత్ సింగ్ బాత్రా, పాజిటివ్ మూవ్స్ కన్సల్టింగ్ కంపెనీలు పాల్గోన్నాయి. ఇప్పటికే రాపిడోలో ఇన్వెస్ట్‌చేసిన హీరో గ్రూప్ పవన్ ముంజల్, వెస్ట్‌బ్రిడ్జ్, నెక్సస్ వెంచర్స్ కూడా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో రాపిడో అతి పెద్ద ట్యాక్సీ ప్లేయర్‌గా నిలుస్తోందని కంపెనీ రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా అన్నారు. రాపిడో ఇప్పటివరకు 130 మిలియన్ డాలర్లను వెస్ట్‌బ్రిడ్జ్ ఏఐఎఫ్, నెక్సస్ వెంచర్స్, సాబెర్ ఇన్వెస్ట్మెంట్, స్కైకాచర్ ఎల్ఎల్సీ, బీఎస్ ఫండ్, ఇంటిగ్రేటెడ్ గ్రోత్ క్యాపిటల్ కంపెనీల నుంచి నిధులను సేకరించింది. రాపిడో బైక్ ట్సాక్సీ సర్వీస్‌లను 2015లో అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లి, ఎస్ఆర్ రిషికేశ్ స్థాపించారు. -
హలో... బైక్ 'పే' చలో
సాక్షి, సిటీబ్యూరో: రాజేశ్ జీడిమెట్ల నుంచి కూకట్పల్లి మెట్రోస్టేషన్‌కు వెళ్లాలి. బస్టాపులో గంటల తరబడి వేచి చూసినా బస్సు రాలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు అరకొరగా తిరుగుతున్నాయి. ఇక లాభం లేదని మరోఆలోచనకు తావు లేకుండా ర్యాపిడో బైక్ ట్యాక్సీనిబుక్ చేసుకున్నాడు.కొద్దిసేపట్లోనే బైక్ ట్యాక్సీ వచ్చేసింది. మెట్రో వరకు ప్రయాణం సాఫీగాసాగిపోయింది. ...ఇలా ఒక్క రాజేశ్ మాత్రమే కాదు.. ఎంతో మంది నగరవాసులు ఇప్పుడు బైక్ ట్యాక్సీల సేవలు వినియోగించుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సకాలంలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకునేందుకు ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఒకే రూట్లో ప్రయాణం చేసేవారు సాధారణంగా క్యాబ్‌లను షేర్ చేసుకునేవారు. కానీ మార్గం ఒక్కటే అయిన వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణికులను చేరవేయాల్సి రావడంతో కొంత జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో చాలామంది ప్రయాణికులు షేర్ క్యాబ్‌లకు బదులు బైక్ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు. సోలో ప్యాసింజర్స్‌కు బైక్ ట్యాక్సీలు ఎంతో అనుకూలంగా ఉంటున్నాయి. క్యాబ్‌ల తరహాలోనే కొన్ని ట్యాక్సీలు రాత్రింబవళ్లు ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తుండగా... మరికొన్ని అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి క్యాబ్‌లతో పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. ఉబర్, ఓలా లాంటి సంస్థలు వివిధ రకాల క్యాబ్ సర్వీసులతో పాటు బైక్ ట్యాక్సీలను కూడా ప్రవేశపెట్టాయి. కానీ ఇటీవల ప్రజారవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ ‘ర్యాపిడో’ బైక్ ట్యాక్సీలతోనే ప్రయాణికులకు చేరువైంది. ఒక్క ర్యాపిడో బైక్ ట్యాక్సీలే నగరంలో ప్రతిరోజు సుమారు 30శాతం ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఉబర్, ఓలా బైక్‌లు సైతం పోటీపడి విస్తరిస్తుండగా... ర్యాపిడో మరో అడుగు ముందుకేసి మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా రైడర్లను ఏర్పాటు చేసింది. మెట్రోరైలుకు అనుసంధానం మెట్రో రైలు ఇప్పుడు లైఫ్‌లైన్‌గా మారింది. ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కానీ చాలామందికి మెట్రో స్టేషన్ వరకు చేరుకోవడం పెద్ద సవాల్‌గా మారింది, మెట్రో మార్గానికి అనుసంధానం చేసే విధంగా సిటీ బస్సులు విస్తరించకపోవడం, మినీ బస్సులు, ఇతరత్రా రవాణా సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ప్రత్యామ్నాయ సదుపాయాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బైక్ ట్యాక్సీలు ప్రస్తుతం ఎంతో అనుకూలంగా మారాయి. ఉదాహరణకు ఉప్పల్ బస్టాపునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మావతి కాలనీ, వెంకటేశ్వర టెంపుల్, శ్రీశ్రీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు నేరుగా వెళ్లేందుకు సిటీ బస్సులు అందుబాటులో లేవు. ఆటోలు బస్టాపు వరకే వెళ్తాయి. అక్కడి నుంచి స్టేషన్ వరకు సెవెన్ సీటర్ ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒక్క రూట్లోనే కాదు. మెట్రోకు సమీపంలోని అనేక ప్రాంతాల్లో, సిటీ బస్సులు అందుబాటులో లేని కాలనీల్లో బైక్ ట్యాక్సీలు పరుగులు తీస్తున్నాయి. మెహిదీపట్నం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్లు, కూకట్పల్లి, జేఎన్టీయూ తదితర ప్రాంతాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. ‘నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోకు రెండువైపులా కనీసం 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా బుకింగ్‌లు వస్తున్నాయి. చాలామంది రాత్రిపూట మెట్రో దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బైక్ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు’ అని చెప్పారు ర్యాపిడో రీజినల్ హెడ్ రాజీవ్ భైరి. ఒక్క ర్యాపిడో మాత్రమే కాదు.. ఉబర్, ఓలా బైక్‌లకు సైతం రాత్రి వేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందని పలువురు రైడర్లు అభిప్రాయపడ్డారు. ప్రమాద బీమా రూ.5 లక్షలు ర్యాపిడో సంస్థ ప్రయాణికులకు ప్రమాద బీమా సైతం కల్పిస్తోంది. ప్రయాణం ప్రారంభమైన వెంటనే ప్రయాణికుడికి, రైడర్‌కు ఇది వర్తిస్తుంది. ‘దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే దాని తీవ్రత మేరకు రూ.5 లక్షల వరకు బీమా ఉంటుందని’ రాజీవ్ తెలిపారు. ప్రస్తుతం బైక్ ట్యాక్సీలు రూ.10 కనీస చార్జీలతో మొదలవుతున్నాయి. కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ బైక్‌ను కొద్దిసేపు వెయిటింగ్లో ఉంచదలిస్తే నిమిషానికి రూ.1.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడి నుంచి చార్జీల రూపంలో వచ్చే డబ్బులో 70శాతం వెంటనే రైడర్ ఖాతాలో చేరిపోతుంది. మరో 30శాతం ర్యాపిడోకు చేరుతుంది. ఆటోలు, క్యాబ్‌ల కంటే బైక్ ట్యాక్సీ చార్జీలు కొంతమేరకు అందుబాటులో ఉండడం వల్ల కూడా ప్రయాణికులు వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. ‘హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి సమీప ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ కంటే బైక్ బెటర్’ అని చెప్పారు విశాల్. సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న అతడు ప్రతిరోజు హైటెక్‌సిటీ నుంచి తార్నాకవరకు మెట్రోలో ప్రయాణం చేస్తున్నాడు. ‘ట్రైన్ దిగిన తర్వాత ఆఫీస్‌కు చేరుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేది. 5 కిలోమీటర్ దూరానికి ఒక్కోసారి గంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధ తప్పింద’ని ఆనందం వ్యక్తం చేశారు విశాల్. సమ్మె ఎఫెక్ట్.. మరింత డిమాండ్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బైక్ ట్యాక్సీలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం బస్సులు అరకొరగా తిరుగుతుండడం వల్ల ప్రయాణికులు వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 7గంటల ఉంచి రాత్రి 12గంటల వరకు ఇళ్లకు చేరుకునే ప్రయాణికులు బైక్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల భద్రత విషయంలో అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తున్నట్లు క్యాబ్ సంస్థలు తెలిపాయి. ‘డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే మా ఎమర్జెన్సీ టీమ్ రెస్పాండ్ అవుతుంది. ఇది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ర్యాపిడో మొబైల్ యాప్‌లో ప్రయాణికుల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. దుష్ప్రవర్తన కలిగిన రైడర్లను తొలగిస్తున్నాం. మా ప్రతి సర్వీసుపై పోలీసుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు రాజీవ్. రోజుకు రూ.1500 ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే రూ.1500 వరకు వస్తాయి. ఒకప్పుడు హైటెక్‌సిటీ నుంచి ఎక్కువ బుకింగ్‌లు ఉండేవి. ఇప్పుడు సిటీలో అన్ని ప్రాంతాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయి. గూగుల్ మ్యాప్ ఆధారంగానే ఎక్కడికైనా వెళ్తున్నాం. – మల్లేష్, రైడర్ సంతృప్తి.. మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వరకు ప్రయాణికులను చేరవేస్తాను. ఈ ప్రొఫెషన్ నాకు చాలా తృప్తినిచ్చింది. ప్రయాణికులు ఎంతో గౌరవం ఇస్తున్నారు. గతంలో మగవారి నుంచి కూడా బుకింగ్‌లు వచ్చేవి. ఇప్పుడు మహిళా రైడర్లు అందుబాటులోకి రావడంతో మహిళా ప్రయాణికులకే ప్రాధాన్యంఇస్తున్నారు. – గాయత్రి, రైడర్ -
బైక్ చాల్లే... క్యాబ్ ఎందుకు?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోడ బోడ, హబల్ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్ షేరింగ్! ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్ షేరింగ్ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్ షేరింగ్ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్ షేరింగ్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్ సర్వీస్ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్ బెంగాల్ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్ బైక్ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్ మోటో, రాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్ట్రిప్, వోగో, టాజో, రోడ్పండా, ఆన్బైక్స్, పీఎస్బ్రదర్స్, రాయల్ బ్రదర్స్, వీల్‌స్ట్రీట్ వంటివి ఈ రంగంలో ఉన్నాయి. ఎలా పనిచేస్తాయంటే...? బైక్ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్‌ను తన షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్‌ను తీసుకోవచ్చు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. కస్టమర్ బైక్‌ను బుక్ చేయగానే.. డ్రైవర్ ఎవరు? అతని ప్రొఫైల్? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ? వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కస్టమర్‌కు కూడా ఒక హెల్మెట్‌ను తెస్తాడు. కస్టమర్‌ను గమ్య స్థానంలో డ్రాప్ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్ బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్ టైమ్ రైడ్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, బైక్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి బైక్ షేరింగ్‌లో ఉంటాయి. మహిళల కోసం ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ కంపెనీ కంట్రోల్‌తో అనుసంధానమై ట్రాకింగ్ చేస్తుంటుంది. ఎందుకింత డిమాండ్? ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్‌లిస్ట్ అవుతున్నారు. దీంతో వీకెండ్స్‌లో, రద్దీ సమయంలో క్యాబ్స్ దొరకటం లేదు. ఇది బైక్ షేరింగ్ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంకా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్‌తో పోల్చితే బైక్‌పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో ఎంట్రీ.. ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్ షేరింగ్ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్ షేరింగ్‌ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగటం కూడా బైక్ షేరింగ్ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్ వంటి స్టార్టప్స్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను వినియోగిస్తున్నాయి. సవాళ్లూ ఉన్నాయ్.. ప్రస్తుతం బైక్ షేరింగ్ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్‌లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్ షేరింగ్ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్ షేరింగ్‌కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్ బైక్ ట్యాక్సీకి లైసెన్స్ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు బైక్ షేరింగ్‌ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి.. హైదరాబాద్‌లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్ షేరింగ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్‌లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్ ఉన్నట్లు సమాచారం. బైక్ షేరింగ్‌లో మహిళలూ యాక్టివే.. గడిచిన ఏడాదిగా బైక్ షేరింగ్ డ్రైవర్స్‌గా మహిళలు కూడా నమోదవుతున్నారు. ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్‌ను ఇతరులకు షేర్ చేస్తూ హెల్ప్ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్‌కు మహిళా కస్టమర్‌నే ఇస్తారు. రైడర్ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్ టైం డ్రైవర్ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్ తీసుకుంటా. తర్వాత యాప్ ఆఫ్ చేసి వర్క్‌లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్‌గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు. -
రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం
సాక్షి, బెంగళూరు: బైక్ సేవల సంస్థ రాపిడో డ్రైవర్లపై దాడి చేసి దోచుకున్న ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లను బెదిరించి డబ్బు, మొబైల్, బ్యాంకు కార్డులను ఎత్తుకుపోయారు. ఈ రెండు ఘటనలు సోమవారం ఉదయం బెంగళూరు నగరంలో చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని ధానేశ్వర్ బేకు హోసూర్ రోడ్‌లోని కుడ్లు గేట్ సమీపంలో ని ఘటనలో డ్రైవర్‌ను ఎత్తుకుపోయి మరీ చోరీకి పాల్పడ్డారు. రాపిడో డ్రైవర్ ధనేశ్వర్ (37) యాప్ ద్వారా వచ్చినసమాచారం ప్రకారం కస్టమర్‌ను పికప్ చేసుకునేందుకు సంబంధిత ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఒక వ్యక్తి కత్తితో ఎటాక్ చేసి డ్రైవర్ మెడ కోశాడు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లు, రూ .1200 నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు, పవర్ బ్యాంక్ లాక్కున్నాడు. అనంతరం ధనేశ్వర్ను బలవంతంగా మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు దుండగులు పొంచి వున్నారు. ఈ ముగ్గురూ కలిసి ధనేశ్వర్ను కొట్టి మరీ ఏటీఎం కార్డు పిన్ అడిగి రూ .500 డ్రా చేశారు. గూగుల్ పే ద్వారా రూ .165 బదిలీ చేయమని బలవంతం చేశారు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బుకోసం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఎలాగోలా ధనేశ్వర్ అక్కడినుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన మరో సంఘటనలో, మరో రాపిడో డ్రైవర్ అమల్ సింగ్ (27) ను ముగ్గురు వ్యక్తులు ఇదే విధంగా కత్తితో బెదిరించి, దోచుకోవడం గమనార్హం. పరప్పన అగ్రహార సమీపంలో ఉన్న పికప్ పాయింట్ వద్దకు అమల్సింగ్ చేరుకోగానే, ముగ్గురు సాయుధ వ్యక్తులు అతడిపై మూకుమ్మడిగా దాడిచేసి మొబైల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు ఉన్న వాలెట్ , ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులే ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ర్యాపిడోలో పవన్ ముంజాల్, రాజన్ ఆనందన్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్, గూగుల్ ఇండియా హెడ్ రాజన్ ఆనందన్‌లు.. బైక్ ట్యాక్సీ ఆపరేటర్ ‘ర్యాపిడో’లో పెట్టుబడులు పెట్టారు. వీరితోపాటు అద్వాంత్ఎడ్జ్ పార్ట్నర్స్, అస్ట్రాక్ వెంచర్స్, టెసెల్లటె వెంచర్స్, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో అనుపమ్ మిట్టల్, స్మైల్ గ్రూప్ పార్ట్నర్స్, ఫ్లిప్‌కార్ట్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నాగోరి, కార్నేషన్ ఆటో సహా వ్యవస్థాపకుడు కునాల్ ఖట్టర్ వంటి తదితరులు ఇన్వెస్ట్ చేశారని ర్యాపిడో తెలిపింది. వీరు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టింది సంస్థ వెల్లడించలేదు. వచ్చిన నిధులను సంస్థ విస్తరణ కోసం ఉపయోగిస్తామని ర్యాపిడో సహా వ్యవస్థాపకుడు అరవింద్ సంకా తెలిపారు. ‘ప్రజలకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా చాలా మందికి ఉపాధిని కల్పించే సామర్థ్యం ర్యాపిడోకు ఉంది. సంస్థ వ్యవస్థాపకులపై నాకు పూర్తి నమ్మకముంది. వారు తమ లక్ష్యాలను చేరుకుంటారని విశ్వసిస్తున్నాను’ అని ముంజాల్ తెలిపారు.