Allu Arjun : ర్యాపిడో స్టార్​ క్యాంపెయిన్​ షురూ | Allu Arjun to be A part Of Rental Taxi Service Rapido Star Campaign | Sakshi
Sakshi News home page

Allu Arjun : ర్యాపిడో స్టార్​ క్యాంపెయిన్​ షురూ

Published Tue, Nov 9 2021 8:54 PM | Last Updated on Tue, Nov 9 2021 8:54 PM

Allu Arjun to be A part Of Rental Taxi Service Rapido Star Campaign - Sakshi

బైక్​ ట్యాక్సీ యాప్​ ర్యాపిడో సెలబ్రిటీ క్యాంపెయిన్​ని ప్రారంభించింది.  ఈ ప్రచారంలో భాగంగా రూపొందించిన వీడియోల్లో  స్టార్​ హీరోలు అల్లు అర్జున్​, రణ్​వీర్​సింగ్​లు నటించారు. స్మార్ట్​హో తో ర్యాపిడో థీమ్​తో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.  ర్యాపిడో అందిస్తున్న ఆఫర్లు, యూనిక్​ ఫీచర్లను వివరించడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు మార్కెట్​ను విస్తృతి చేసుకోవడం లక్ష్యంగా ర్యాపిడో ప్రచారం చేపట్టింది. 

నవంబర్​ 5న ఈ సెలబ్రిటీ క్యాంపెయిన్​ మొదలైంది. ఆరు వారాల పాటు 14 నగరాల్లో ప్రచారం జరగనుంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక వీడియో యాడ్​లకు ఏస్​ డైరెక్టర్లు త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సిజిల్​ శ్రీవాస్తవలు దర్శకత్వం వహించారు. వీటిని డ్రీమ్​వాల్ట్​ మీడియా చిత్రీకరించింది. ర్యాపిడో మార్కెటింగ్ హెడ్ అమిత్ వర్మ మాట్లాడుతూ .. అల్లు అర్జున్, రణవీర్ సింగ్‌లతో సెలబ్రిటీ ప్రచారం చేస్తున్నందుకు  ఆనందంగా ఉందన్నారు. ర్యాపిడో ప్రచారంలో భాగమైనందుకు  ఆనందంగా ఉందని అల్లు అర్జున్​ వెల్లడించారు. 

52మిలియన్లు ఫండింగ్‌ 
ర్యాపిడో దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో 150,000 నుంచి 160,000 బైక్‌ సేవల్ని, 26 నగరాల్లో 70వేల ఆటోలు రిక్షా సేవలుల్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ర్యాపిడో సేవల్ని మరింత విస్తరించేందుకు ఇటీవల 52 మిలియన్ల ఫండింగ్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

ఆర్టీసీ అభ్యంతరం
ర్యాపిడో యాడ్​లో తమ సంస్థ బ్రాండ్​ ఇమేజ్​కి నష్టం కలిగేలా  అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ర్యాపిడో, హీరో అల్లు అర్జున్​లకి టీఎస్​ఆర్టీసీ లీగల్​ నోటీసులు పంపింది.  ప్రజా ప్రయోజనాలకు హానీ కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement