బైక్‌ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్‌ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు.
ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment