కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా నలుగురితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ట్రెక్కింగ్, క్యాంపింగ్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము ఉన్నత ఉద్యోగం చేస్తున్నామనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్యాబ్, టూవీలర్లకు డ్రైవర్లుగా మారిపోతున్నారు.
బెంగళూరుకు చెందిన నిఖిల్ సేఠ్ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్‌లతో పంచుకున్నాడు. తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నట్లు తెలిపాడు. ర్యాపిడో బైక్ ఎక్కి వెళుతుండగా..మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌తో మాట కలిపినట్లు చెప్పాడు. మాటల సందర్భంలో తాను (ర్యాపిడో డ్రైవర్) మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నా..ర్యాపిడ్ ఎందుకు చేస్తున్నారు. అని ప్రశ్నించిన నిఖిల్ సేఠ్‌కు సదరు డ్రైవర్ నుంచి ఊహించిన సమాధానం ఎదురైంది.
నేను మనుషుల్ని ప్రేమిస్తాను..వస్తువుల్ని వాడుకుంటాను సార్. నాకు మనుషులతో మాట్లాడడం అంటే మహా ఇష్టం. కానీ నేను మాట్లాడేందుకు నా చుట్టు పక్కల మనుషులు లేరు.అందుకే నేను వారితో మాట్లాడేందుకు ఇలా ర్యాపిడో డ్రైవర్‌గా అవతారం ఎత్తినట్లు చెప్పినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఆ ట్విట్‌పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment