
కొచ్చి: ఒక మహిళ మద్యం మత్తులో ఉండటంతో అఘాయిత్యానికి తెగబడ్డాడు ఒక రాపిడో బైక్ డ్రైవర్. ఈఘటన కేరళలో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....22 ఏళ్ల కేరళ మహిళపై సాముహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడి ఇంటికి వెళ్లిన మహిళ తిరుగు ప్రయాణంలో రైడ్ షేరింగ్ అప్లికేషన్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంది. ఐతే ఆమె ఆ సమయంలో మద్యం మత్తులో ఉంది.
ఆమె గమ్యస్థానానికి వచ్చినా దిగే పరిస్థితిలో లేదు. దీంతో దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ డ్రైవర్ ఆ మహిళను తన ఇంటికి తీసుకువెళ్లి తన సహచరుడితో కలసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె స్ప్రుహలోకి రావడంతో తీవ్ర నొప్పికి గురయ్యింది. దీంతో ఆమె నిందితుడి ఇంటి నుంచి బయటపడి ఆస్పత్రికి వెళ్లింది.
అక్కడ వైద్యులు పరీక్షించి పోలీసులు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు భాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో బాధితురాలు పశ్చిమ బెంగాల్ చెందిన మహిళ కాగా, నిందితులిద్దరూ బెంగళూరు చెందిన వారని చెప్పారు.
(చదవండి: తండ్రికి గుండె నొప్పి వచ్చిందని...కంగారులో కారుని వేగంగా పోనివ్వడంతో...)
Comments
Please login to add a commentAdd a comment