– ర్యాపిడో యువకుడిని ఏమార్చిన మరో యువకుడు
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్‌ఫోన్‌తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు.
ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్‌లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్‌పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్‌ను కూకట్‌పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు.
దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్‌కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment