Rapido Organises Special Screening of Jailer for Chennai Auto Drivers - Sakshi
Sakshi News home page

Jailer Movie: జైలర్ స్పెషల్ షోలు.. వారి కోసం బంపరాఫర్‌ ముందుకొచ్చిన సంస్థ!

Published Fri, Aug 11 2023 8:59 PM | Last Updated on Fri, Aug 11 2023 9:20 PM

Rapido organises special screening of Jailer for Chennai auto drivers - Sakshi

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్‌ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీష్రాఫ్‌, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, తెలుగు నటుడు సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందించగా.. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్‌ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా రూ.52 కోట్లు రాబట్టింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది.   ఈ నేపథ్యంలో చెన్నైలో రిలీజ్ రోజే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ ముందడుగేసింది.

(ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై బుల్లితెర నటి!)

తాజాగా ర్యాపిడో సంస్థ రజినీకాంత్‌పై తమ అభిమానాన్ని చాటుకుంది. ముఖ్యమైన నగరాల్లో బైక్, ఆటో ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో సంస్థ తమ డ్రైవర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ర్యాపిడో ఆటో ట్యాక్సీ సేవలు అందించే  కెప్టెన్స్ కోసం జైలర్‌ ప్రత్యేక షో వేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ర్యాపిడో సంస్థ స్వయంగా ప్రకటించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్‌లో కేవలం వారి కోసమే ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. 

సంస్థ నిర్ణయంతో 500కు పైగా ర్యాపిడో ఆటో డ్రైవర్లకు తమ అభిమాన హీరో తలైవా జైలర్ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది. సంస్థ నిర్ణయం పట్ల ర్యాపిడో కెప్టెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వారి సేవలను కొనియాడారు. కాగా.. జైలర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ వారి కోసం ప్రత్యేక షో వేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో  తెగ వైరలవుతున్నాయి.

(ఇది చదవండి: జైలర్‌ కోసం జపాన్‌ నుంచి అభిమానులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement