Rajinikanth heads to the Himalayas ahead of the 'Jailer' movie release - Sakshi
Sakshi News home page

Jailor Movie: సూపర్ స్టార్‌కు ఆ సెంటిమెంట్‌.. జైలర్‌ రిలీజ్‌కు ముందు!

Published Wed, Aug 9 2023 8:49 PM | Last Updated on Thu, Aug 10 2023 3:17 PM

Rajinikanth Follows Himalayas Sentiment For His Jailor Movie - Sakshi

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక చిత్రం హిట్‌ అయితే.. అదే తరహాలోనే సెంటిమెంట్‌ ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారిలో తలైవా ముందుంటారు.  తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన మరి కొద్దిగంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. 

(ఇది చదవండి: భోళా శంకర్‌ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు)

ఈ నేపథ్యంలోనే తలైవా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్‌ తన చిత్రం విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఎప్పటిలాగే సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.  అయితే ఆ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా హిమాలయాలకు వెళ్లలేదు. అలాంటిది జైలర్‌ చిత్రం రిలీజ్ కానుండడంతో రజనీకాంత్‌ హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. 

సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించడం ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.  కాగా.. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌, తెలుగు నటుడు సునీల్‌, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు

ఇదిలా ఉండగా జైలర్‌ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడం మరో విశేషం. దీంతో ఆయన పలువురు సూపర్ స్టార్ అభిమానులు బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. కాగా జైలర్‌ చిత్రాలు చూడటానికి చైన్నెలోని ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మరో విశేషం. 

(ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement