గతేడాది జైలర్ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన తలైవా రజినీకాంత్. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తలైవా రెడీ అయిపోయారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ కట్టడం సర్వసాధారణం. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అదే రేంజ్‌లో పోటీ ఉంటుంది. అయితే పొంగల్ బరి నుంచి రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ తప్పుకుంటున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్య రజినీకాంత్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కొత్త రిలీజ్ తేదీని ఆమె ప్రకటించింది.
కాగా.. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజీనీకాంత్.. మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ చేశారు. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో క్రికెట్, రాజకీయాల చుట్టూ తిరిగే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.
కాగా.. కొన్నేళ్లపాటు విరామం తీసుకున్న తర్వాత రజినీకాంత్ కూతురు ఐశ్వర్య లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విఘ్నేశ్, లివింగ్‍స్టన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష. వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
9-2-2024 ! #LalSalaam pic.twitter.com/3pk9jWb8MG
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) January 9, 2024
Comments
Please login to add a commentAdd a comment