'అలాంటి వాడే చాలా ప్రమాదకరం'.. ఆసక్తిగా లాల్ సలామ్ ట్రైలర్! | Rajinikanth's Lal Salaam Telugu Trailer Released Today | Sakshi
Sakshi News home page

Lal Salaam Telugu Trailer: 'అలాంటి వాడే చాలా ప్రమాదకరం'.. ఆసక్తిగా లాల్ సలామ్ ట్రైలర్!

Published Wed, Feb 7 2024 7:29 PM | Last Updated on Thu, Feb 8 2024 10:09 AM

Rajinikanth Lal Salaam Telugu Trailer Released Today - Sakshi

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ కీల‌క పాత్ర‌లో నటించిన చిత్రం లాల్ సలామ్. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ష‌న్‌‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కనిపించనున్నారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ విడుదల చేస్తోంది.

తాజా ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్ భాయ్ రాక వంటి అంశాలతో పవర్ ఫుల్ ట్రైలర్‌గా నిలిచింది.  ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిలి పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది.

కాగా.. ఈ సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌స‌న్న‌, తంగ దురై కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement