Rajinikath
-
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు షాక్.. సంక్రాంతి రేసు నుంచి అవుట్!
గతేడాది జైలర్ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన తలైవా రజినీకాంత్. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తలైవా రెడీ అయిపోయారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ కట్టడం సర్వసాధారణం. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అదే రేంజ్లో పోటీ ఉంటుంది. అయితే పొంగల్ బరి నుంచి రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ తప్పుకుంటున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్య రజినీకాంత్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కొత్త రిలీజ్ తేదీని ఆమె ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజీనీకాంత్.. మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో క్రికెట్, రాజకీయాల చుట్టూ తిరిగే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. కాగా.. కొన్నేళ్లపాటు విరామం తీసుకున్న తర్వాత రజినీకాంత్ కూతురు ఐశ్వర్య లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విఘ్నేశ్, లివింగ్స్టన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష. వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 9-2-2024 ! #LalSalaam pic.twitter.com/3pk9jWb8MG — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) January 9, 2024 -
జైలర్ రిలీజ్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న తలైవా!
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక చిత్రం హిట్ అయితే.. అదే తరహాలోనే సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారిలో తలైవా ముందుంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన మరి కొద్దిగంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు) ఈ నేపథ్యంలోనే తలైవా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్ తన చిత్రం విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఎప్పటిలాగే సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా హిమాలయాలకు వెళ్లలేదు. అలాంటిది జైలర్ చిత్రం రిలీజ్ కానుండడంతో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించడం ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు ఇదిలా ఉండగా జైలర్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడం మరో విశేషం. దీంతో ఆయన పలువురు సూపర్ స్టార్ అభిమానులు బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. కాగా జైలర్ చిత్రాలు చూడటానికి చైన్నెలోని ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మరో విశేషం. (ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? ) -
ఆదియోగి సేవలో రజనీకాంత్!
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి కర్ణాటక, చిక్కబల్లాపుర జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు ఈషా యోగ మందిరం తరపున ఈఏడాది జనవరి 15 కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపుర జిల్లాలోని నందిమలై (కొండ) పరీవాహక ప్రాంతంలో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోయంబత్తూరులోని శివుని శిలా విగ్రహం మాదిరిగానే చిక్కబల్లాపురలో ఆదియోగి శిలా విగ్రహం ఉండడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తులు శనివారం నుంచే శివ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నటుడు రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి ఆదియోగిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ యోగేశ్వర లింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘జైలర్’గా వస్తున్న సూపర్ స్టార్, టైటిల్ పోస్టర్ రిలీజ్
తలైవా రజనికాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్‌ను ఖారారు ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కత్తికి రక్తపు మరకలతో పోస్టర్ రూపొందించారు. జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీకి జోడిగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా నటి ప్రియాంక కనిపించనుండగా.. నటి రమ్యకృష్ణ, డైరెక్టర్ కేఎస్ రవికూమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలు చేయనున్నారని వినికిడి. జులై నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. #Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c — Sun Pictures (@sunpictures) June 17, 2022 -
ప్రేమ పాట పాడుకుంటున్న రజనీ, నయనతార
రజనీకాంత్, నయనతార ప్రేమ పాట పాడుకుంటున్నారు. ఈ లవ్ జర్నీ ‘అన్నాత్తే’ సినిమా కోసమే. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో రజనీ, నయనతారపై డ్యూయట్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ పాట తర్వాత రజనీ, విలన్లపై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ‘అన్నాత్తే’ సినిమా ఈ ఏడాది నవంబరు 4న విడుదల కానుంది. -
చెల్లెమ్మా.. ఇదిగో ప్రతీకారం!
చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం నీ సింధూరాన్ని చెరిపిన దుర్మార్గులను పన్నెండవ రోజు వేకువ సింధూరం కనపడకముందే పిండప్రదానానికి ముష్కరుల రక్తప్రదానం చేశాము ఎరుపెక్కిన నీ కన్నీటి కళ్లకు ప్రతీకారంగా ఆకాశాన్ని ఆ దుర్మార్గుల రక్తంతో దిద్దాము నీ గుండెఘోష చల్లారకముందే వెయ్యికిలోల బాంబులు వాళ్ల విషకడుపులో కుక్కాము నువ్వు పోగొట్టుకున్నదానిని తిరిగి తేలేము కానీ ఈ దేశం... నీ దేశం అని.. మేమంతా నీ కుటుంబమని... నువ్వు అనాథవు కావని.. నీ కన్నీరు వృథా కాదని... నీ భర్త త్యాగం వ్యర్థం కాదని... దేశమంతా ఒక్కటై.. నీతో ఒక్కటై గర్జించింది... చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం! బ్రేవో ఇండియా. – రజనీకాంత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు పెద్ద సెల్యూట్. జైహింద్. – ప్రభాస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జయహో. – సల్మాన్ ఖాన్ మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. ఎయిర్‌ఫోర్స్‌కు నా సెల్యూట్.– ఎన్టీఆర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైహింద్ – రామ్‌చరణ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... మీకు సెల్యూట్ చేస్తున్నాం. దేశం గర్వించే రోజు ఇది.–అఖిల్ అక్కినేని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సెల్యూట్ చేస్తున్నా. – సోనాక్షి సిన్హా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి దేశం యావత్తూ సెల్యూట్ చేస్తోంది.– రకుల్ ప్రీత్ టెర్రరిస్ట్ క్యాంపులను సమూలంగా నాశనం చేసిన మన 12 మంది సైనికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆ హీరోలను చూసి దేశం గర్విస్తుంది. వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను – కమల్‌హాసన్ మా చెంప మీద కొడితే మరో చెంప చూపించబోము. దాని బదులు మీ కాలర్‌ను పట్టుకొని చితకబాదేస్తాం. అందుకే.. మాతో పెట్టుకోవాలంటే మరోసారి ఆలోచించండి. – చేతన్ భగత్ ఉగ్రవాదులను హతమార్చడం అంటే భవిష్యత్‌లో ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడటమే. సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలను భస్మీపటలం చేసిన భారత వైమానిక దళానికి సెల్యూట్ చేస్తున్నా.– ప్రీతీజింతా టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేసిన మన భారతీయ వైమానిక దళ వీరులను చూసి గర్వపడుతున్నా. అందర్ ఘుస్కే మారో (చొచ్చుకెళ్ళి హతమార్చండి) – అక్షయ్ కుమార్ యాద్ రహే నామ్ నమక్ ఔర్ నిషాన్ మర్చిపోవద్దంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కీ, నాయకుడూ సుప్రీం కమాండర్ అయిన ప్రధాని నరేంద్రమోదీకి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్ సర్జికల్ స్ట్రైక్స్ 2, టెర్రరిజాన్ని అంతం చేయాలి.– సెలీనా జైట్లీ భారత వైమానిక సైన్యం నాకు గర్వకారణం. సాహసోపేత చర్యకి సెల్యూట్ చేస్తున్నా. – తమన్నా జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాను – అభిషేక్ బచన్ భారత సైన్యం మాకు గర్వకారణం. ఇండియా స్టైక్ బ్యాక్. జైహింద్ – సోనూ సూద్ తీవ్రవాదంపై భారత సైన్యం దాడికి హ్యాట్సాఫ్. ప్రతి భారతీయుడూ గర్వపడతారు. – కిదాంబి శ్రీకాంత్ మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ధైర్య సాహసాలు చూపించిన ఫైలెట్స్కు సెల్యూట్. – మహేశ్‌బాబు ‘ద బాయ్స్ హావ్ ప్లేడ్ రియల్లీ వెల్’ (మన వాళ్ళు బ్రçహ్మాండంగా ఆడారు) ‘మీరు (పాక్) మారండి లేదంటే మేమే మారుస్తాం’ – వీరేంద్ర సెహ్వాగ్ మంచితనాన్ని చేతకానితనంగా ఎప్పుడూ ఊహించుకో కూడదు. మన ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నాను. – సచిన్ టెండుల్కర్ టెర్రరిజానికి అవసరమైన మెసేజ్ పంపింది మన ఎయిర్‌ఫోర్స్. బ్రేవో ఎయిర్ ఫోర్స్. గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై హింద్. – అజింక్యా రెహానే భారత వైమానిక దళ గొప్పతనానికి సెల్యూట్ చేస్తున్నా.– మహమ్మద్ కైఫ్ ఇండియా స్ట్రైక్ బ్యాక్, భారత వైమానిక దళానికి బిగ్ సెల్యూట్.– సైనా నెహ్వల్ ఆçహ్లాదకరమైన శుభోదయం. మన సైన్యం దిటవు గుండెలకు జయహో. – పరేష్ రావెల్ ఇండియా తిరిగి కొట్టింది. తిప్పి కొట్టింది. జై హింద్ ఐఏఎఫ్. – గౌతం గంభీర్ సమయానుకూలంగా స్పందించిన భారతీయ వైమానికదళ ధీరుల సాహసచర్యకు నా సెల్యూట్. – శిఖర్ దావన్ సాహో సర్జికల్ స్ట్రైక్స్... ప్రధాని మోడీకి సెల్యూట్ చేయడం ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. – అనుపమ్ ఖేర్ మన ఎయిర్‌ఫోర్స్‌ను చూసి ఎంతో గర్విస్తున్నాను. సెల్యూట్ ఐఏఎఫ్. జైహింద్.– యువరాజ్ సింగ్ మన వైమానిక దళాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సెల్యూట్ ఐఏఫ్. జై హింద్. – మాధురీ దీక్షిత్ -
‘రోబో 2.0’పై టెల్కోల అభ్యంతరం
న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)ని కోరాయి. మొబైల్ ఫోన్లు, టవర్ల ద్వారా వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు .. ఇటు పర్యావరణానికి అటు మానవాళితో పాటు పక్షులు తదితర జీవరాశులకు హానికరమన్న భావన కలిగించేలా ఈ సినిమా ట్రైలర్స్ ఉన్నాయని సీవోఏఐ ఆరోపించింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా మొబైల్ టవర్లు, ఫోన్లపై అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా ఇవి ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఎఫ్సీ తమ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకునే దాకా టీజర్, ట్రైలరుతో పాటు తమిళ వెర్షన్‌కి ఇచ్చిన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 29న విడుదల అవుతోంది. -
‘కాలా’ శాటిలైట్ రైట్స్‌కు భారీ ప్రైజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తమిళనాట సినీరంగం సమ్మె కారణంగా కాలా సినిమాను జూన్ 7కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేకపోయినా.. కాలా సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సంస్థ 75 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తుండటంతో ఉత్తరాదిలో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రజనీ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. -
రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలి: హీరోయిన్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతూనే వస్తోంది. అభిమానులు, కొంత మంది నాయకులు ఆయన రాజకీయ ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో తాను ఉన్నానని అంటోంది విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు. రజనీకాంత్ సార్ రాజకీయాల్లోకి రావాలని భారతీయ చిత్ర పరిశ్రమలోనే క్రేజీ నటిగా విరజిల్లుతున్న నటి శృతిహాసన్ అన్నది. ఈ బోల్డ్ తార ఏం చెప్పినా, ఏం చేసినా సంచలనమే. తనకు నచ్చింది చేసే, మనసుకు తట్టింది చెప్పే అరుదైన హీరోయిన్లలో శృతి ఒకరని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ మధ్య పెళ్లికి ముందే బిడ్డను కంటాను అని ఈ బ్యూటీ అన్నట్లు మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన శృతి పలు అంశాల గురించి ఒక భేటీలో తనదైన బాణీలో టకటకా చెప్పేశారు. వాటిలో కొన్నిటిని చూద్దాం. తాను ఎవరి సిపార్సుతోనూ నటిని కాలేదని.. సొంత ప్రయత్నంతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. తన తండ్రి సాధనలో తాను ఒక్క శాతం కూడా సాధించలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలకు రక్షణ కరువైందని ఆమె అన్నారు. దీనికి ఎవరినీ తప్పు పట్టి లాభం లేదని ఈ సమాజమే అలా ఉందన్నారు. మన దేశంలో మగవారికే గౌరవం అధికం అని పేర్కొన్నారు. చాలా మంది మగబిడ్డ పుడితే పండగ చేసుకుంటారని, ఆడపిల్ల పుడితే బాధ పడతారని శృతి అన్నారు. అయితే తమ ఇంట్లో అలా కాదన్నారు. తనకు మగపిల్లాడు పుడితే ఆడవారిని గౌరవించాలనే విషయాలు నేర్పిస్తానన్నారు. తమిళనాడు గానీ, తమిళులను గానీ తక్కువ చేసి మాట్లాడితే తాను అలాంటి వారి పని పడతానని నటి హెచ్చరించారు. తన తండ్రి ఒక టీవీలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్ షో గురించి స్పందించాల్సిందిగా కోరగా ఆ షోను తాను ఇంకా చూడలేదని చెప్పారు. నటుడు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి జరుగుతున్న చర్చపై మాట్లాడుతూ రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలన్నారు. అప్పుడే తమిళనాడులో మార్పు వస్తుందనీ, సినిమా రంగానికీ గౌరవం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంఘమిత్ర చిత్రం వివాదం గురించి అడిగిన ప్రశ్నకు అది ముగిసిపోయిన కథ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తండ్రి దర్శకత్వంలో నటిస్తున్న శభాష్‌నాయుడు షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా మళ్లీ సంగీతంపై దృష్టిసారిస్తున్నారు. తన సంగీత బృందంతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్‌ను తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.