ప్రేమ పాట పాడుకుంటున్న రజనీ, నయనతార | Rajinikanth Nayanthara Resume Shooting For Annaatthe | Sakshi
Sakshi News home page

ప్రేమ పాట పాడుకుంటున్న రజనీ, నయనతార

Published Thu, Mar 25 2021 6:43 PM | Last Updated on Thu, Mar 25 2021 9:45 PM

Rajinikanth Nayanthara Resume Shooting For Annaatthe - Sakshi

రజనీకాంత్, నయనతార ప్రేమ పాట పాడుకుంటున్నారు. ఈ లవ్‌ జర్నీ ‘అన్నాత్తే’ సినిమా కోసమే. శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఓ భారీ సెట్‌లో రజనీ, నయనతారపై డ్యూయట్‌ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ పాట తర్వాత రజనీ, విలన్లపై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ‘అన్నాత్తే’  సినిమా ఈ ఏడాది నవంబరు 4న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement