
తలైవా రజనికాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్‌ను ఖారారు ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కత్తికి రక్తపు మరకలతో పోస్టర్ రూపొందించారు. జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో రజనీకి జోడిగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా నటి ప్రియాంక కనిపించనుండగా.. నటి రమ్యకృష్ణ, డైరెక్టర్ కేఎస్ రవికూమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలు చేయనున్నారని వినికిడి. జులై నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022
Comments
Please login to add a commentAdd a comment