Nelson
-
'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ
'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది. అలానే మనకు ఎంత డబ్బున్నా సరే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు.ఎవరెలా చేశాడు?బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, చెన్నై: బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో మంగళవారం మరో మలుపు చోటు చేసుకుంది. సినీ రంగానికి చెందిన దర్శకుడు నెల్సన్, ఆయన సతీమణి మోనీషాను పోలీసులు ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. బీఎస్పీ నేత ఆమ్ర్స్టాంగ్ చెన్నైలో గత నెల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో 24 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఓ నిందితుడైన తిరువెంగడం పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు చోటు చేసుకంటూ వస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీ స్థానిక నాయకులు, కీలక రౌడీలను కేసులో అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో కేసు సినీ రంగం వైపుగా మరలడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో ప్రముఖ రౌడీ శంభోశంకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ప్రధాన అనుచరుడైన గుండు కృష్ణన్ కోసం కూడా వేట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు లభించిన ఆధారాలు, పట్టుబడ్డ వారు ఇచ్చిన వివరాలు, సెల్ నెంబర్లు, కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గుండు కృష్ణన్‌తో జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ సతీమణి మోనీషా పలుమార్లు మాట్లాడినట్టు విచారణలో తేలింది. దీంతో ఆమెను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. మంగళవారం పోలీసులు ఆమె వద్ద తీవ్రంగా విచారణ చేపట్టారు. అలాగే నెల్సన్ ను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. దీని ఈ జంట స్పందించాల్సి ఉంది. -
మామకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని లాక్ చేసిన అల్లుడు
-
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్‌తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా...! కామెడీతో ఆడుకుంది
-
‘జైలర్’గా వస్తున్న సూపర్ స్టార్, టైటిల్ పోస్టర్ రిలీజ్
తలైవా రజనికాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్‌ను ఖారారు ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కత్తికి రక్తపు మరకలతో పోస్టర్ రూపొందించారు. జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీకి జోడిగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా నటి ప్రియాంక కనిపించనుండగా.. నటి రమ్యకృష్ణ, డైరెక్టర్ కేఎస్ రవికూమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలు చేయనున్నారని వినికిడి. జులై నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. #Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c — Sun Pictures (@sunpictures) June 17, 2022 -
‘నెల్సన్’ మొదలైంది
యంగ్ డైరెక్టర్ సునీల్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నెల్సన్’. ‘జయంత్’అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు మొదలయ్యాయి. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్‌పై హాట్ కామెంట్స్..
సాక్షి, చెన్నై: సినిమాల్లో దళపతిగా ఉన్న తాను తలైవా (నాయకుడి)గా అవతరించడం అనేది కాలం చేతుల్లోనే ఉందని సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ పయనాన్ని కాలంతో పాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీస్ట్ చిత్రం విడుదల వేళ విజయ్ తన స్వరాన్ని మార్చారు. రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న తెర మీదకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్లో ఆదివారం రాత్రి చిట్‌చాట్ కార్యక్రమం జరిగింది. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా, సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి. తనదైన శైలిలో.. నెల్సన్ ప్రశ్నలకు తన దైన స్టైల్లో విజయ్ సమాధానాలు ఇచ్చారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్ వివరించారు. అలాగే తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌తో ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని, దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంజయ్ తెర మీద కనిపిస్తాడా...? లేదా కెమెరా వెనుక ఉంటాడా..? అనేది తెలియదని, తాను అందరిలాగే ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, అవకాశాలు వస్తున్న మాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ పయనం గురించి గుర్తు చేస్తూ, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలి నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానుల గెలుపును గుర్తు చేస్తూ విల్సన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. అలాగే, దళపతిగా ఉన్న తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని, అభిమానులే నిర్ణయిస్తారని ముగించడం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
అందుకే మీడియాకు దూరంగా ఉంటా: హీరో విజయ్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అయితే తన తాజా చిత్రం 'బీస్ట్' ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా 'బీస్ట్' చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో తెలిపాడు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారన్నాడు. అయితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. ఆ వ్యాఖ్యలు చేసింది అసలు నేనేనా అనుకునేలా నా మాటలు మార్చి రాసారన్నాడు. ఇక దాంతో నువ్విలా మాట్లాడావంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ తన సన్నిహితులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు. అలా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాయడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని తెలిపాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ బయటి వాళ్లందరికీ తెలియవు. వారందరూ ఆ వార్తలను నమ్ముతారు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు. -
ఆ సంచలన దర్శకుడితో రజినీకాంత్
గత కొంత కాలంగా అనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నప్పటకీ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాత్రం సినిమాలు చేయడం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ మద్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేసారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజినీ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తలతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే.. త్వరలోనే రజినీకాంత్ తన 169వ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రజినీ మరో కుర్ర దర్శకుడితో పని చేయబోతున్నట్టు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'బీస్ట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్‌తో తన తదుపరి సినిమా చేయడానికి సూపర్ స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'డాక్టర్' చిత్రంతో ఈ దర్శకుడు బ్లాక్బప్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రజినీకాంత్ గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివ లాంటి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేస్తూ యంగ్ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
వణక్కమ్ దీపికా
దీపికా పదుకోన్‌కి తమిళ పరిశ్రమ వణక్కమ్ చెప్పబోతోందని సమాచారం. అంటే.. స్వాగతం అని అర్థం. విషయం ఏంటంటే... తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్యాన్ ఇండియా మూవీలో దీపిక హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు సినిమాకి సై అన్న దీపికా అటు తమిళ చిత్రాన్ని కూడా ఒప్పుకోవాలనుకుంటున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం విజయ్‌కి 65వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్‌కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని రూపొందించనుందట. అందుకే భారీ తారాగణం ఉండేలా చూస్తున్నారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారట. కాగా విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
నెట్టింట్లో జనం
దేశ ప్రజలను కరోనా ఇళ్లకే పరిమితం చేసింది. లాక్డౌన్ కొత్త విషయాలను అనుభవంలోకి తెచ్చింది. ఇంటర్నెట్ ప్రధానస్రవంతిలో భాగమైంది. నీల్సన్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ)విడుదల చేసిన డేటాని బట్టి గత నెల రోజులుగా నగరాల్లో ఇంటర్నెట్ వాడుతోన్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగి 54 శాతానికి చేరింది. ఇంకా చెప్పాలంటే నగరాల్లో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగిస్తోన్న వారు 32 శాతానికి పెరిగారు. ఇంటర్నెట్ వినియోగం జాతీయ సగటు 40 శాతంగా ఉంది. ఇంటర్నెట్ వినియోగానికి స్మార్ట్ ఫోన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించక ముందు రోజుకి మూడు గంటల 22 నిమిషాలపాటు స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించేవారు. అయితే కరోనా లాక్డౌన్ కాలంలో రోజుకి నాలుగు గంటలపాటు స్మార్ట్ఫోన్లపైనే సమయాన్ని వెచ్చిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌లకోసం ప్రధానంగా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. -
ఎంతవరకో?
‘డోర, మాయ, ఆరమ్’ వంటి లేడీ ఓరియంటడ్ సినిమాల్లో నటించిన నయనతార మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి రెడీ అయ్యారు. ‘కోకో’ (కోలమావు కోకిల) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి డార్క్ కామెడీ జానర్లో సాగుతుందని సమాచారం. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకుడు. ‘ఆరమ్’ వంటి సీరియస్ డ్రామా తర్వాత కామెడీతో వస్తున్నారు నయనతార. ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఎదువరయో..’ (ఎంతవరకో అని అర్థం)ను రిలీజ్ చేశారు. దర్శకుడు గౌతమ్ మీనన్, రచయిత వివేక్ కలిసి రచించిన ఈ పాటను సియన్ రోల్డన్తో కలిసి గౌతమ్ మీనన్ పాడటం విశేషం. -
నెల్సన్ (సాక్సటన్ ఓవల్)
సాక్సటన్ ఫీల్డ్ కాంప్లెక్స్‌లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. నెల్సన్ సిటీ కౌన్సిల్, టాస్మాన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, నెల్సన్ క్రికెట్ సంఘం సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, సాఫ్ట్బాల్లకు కూడా ఈ స్టేడియాన్ని ఉపయోగిస్తారు. అసలు స్టాండ్స్ లేని ఈ మైదానాన్ని ఓ పార్క్‌లో రూపొందించారు. బౌండరీ బయట కూర్చుని మ్యాచ్ చూడటమే తప్ప కుర్చీలు ఉండవు. 2011లో కొత్తగా పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. మైదానంలో రెండు వైపుల స్థూపాకార రూపంలో ఉన్న బిల్డింగ్లు అదనపు ఆకర్షణ. దీని కెపాసిటీ కేవలం 5 వేలు మాత్రమే. టాస్మాన్ నది ఒడ్డున 1841లో నిర్మించిన ఈ నగరం భౌగోళికంగా న్యూజిలాండ్‌కు మధ్యలో ఉంటుంది. సుదీర్ఘమైన గోల్డెన్ బీచ్‌లు, పెద్దపెద్ద అడవులు, ఎత్తై పర్వతాలు నెల్సన్‌కు ప్రత్యేక ఆకర్షణ. -
మండేలా పరిస్థితి మరింత విషమం