Rajinikanth 169th Movie With Vijay Beast Movie Director Nelson Dileep Kumar, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajinikanth Upcoming Movie: విజయ్‌ దర్శకుడితో రజినీకాంత్

Published Wed, Feb 9 2022 12:07 AM | Last Updated on Wed, Feb 9 2022 9:16 AM

Rajinikanth Next Film With Beast Director Nelson Dileep Kumar - Sakshi

గత కొంత కాలంగా అనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నప్పటకీ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ మాత్రం సినిమాలు చేయడం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ఈ మద్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేసారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజినీ. 

ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తలతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే.. త్వరలోనే రజినీకాంత్ తన 169వ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 

రజినీ మరో కుర్ర దర్శకుడితో పని చేయబోతున్నట్టు సమాచారం. తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో 'బీస్ట్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్‌తో తన తదుపరి సినిమా చేయడానికి సూపర్‌ స్టార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'డాక్టర్‌' చిత్రంతో ఈ దర్శకుడు బ్లాక్‌బప్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే రజినీకాంత్ గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివ లాంటి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేస్తూ యంగ్ టాలెంట్స్‌ని ఎంకరేజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement