‘నెల్సన్‌’ మొదలైంది | Nelson Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

‘నెల్సన్‌’ మొదలైంది

Published Thu, May 12 2022 2:28 PM | Last Updated on Thu, May 12 2022 2:28 PM

Nelson Movie Pooja Ceremony - Sakshi

యంగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నెల్సన్‌’. ‘జయంత్‌’అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు మొదలయ్యాయి. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.

త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది.ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement