Jayanth
-
మణిపుర్ హింసకు పరిష్కార మార్గం
ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో నూతన సంవత్సర ప్రారంభంలోనే తిరిగి హింసాకాండ చెలరేగింది. రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో సమూహాల మధ్య విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అక్కడి ప్రధాన తెగలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ... వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు చేసుకున్నారు. నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. ముందుగా మణిపుర్ కొండలు, లోయలలో కాల్పుల శబ్దాలు ఆగవలసి ఉంటుంది. ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సుందర మైన ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో తాజా దశ హింసాకాండ చెలరేగింది. మొదటి దశలో నమోదైన జాతిపర మైన ఉన్మాదం, ఇప్పుడు సాయుధ సమూహాల మధ్య క్రూరమైన పాశ్చాత్య తరహా తుపాకీ కాల్పుల స్థాయికి దిగజారింది. మొదటి కొన్ని నెలల హింస ఫలితంగా అక్కడ కనిపించని జాతిపరమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. మైతేయిలు ఎల్లప్పుడూ ఆధిపత్యం వహించే ఇంఫాల్ లోయ నుండి కుకీలు, జోలు, ఇతర గిరిజనులు నిష్క్రమించారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడిచే కొండ జిల్లాలను మైతేయిలు ఖాళీ చేశారు. 1947లో పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలనా కాండను ఇది తలపిస్తోంది. అస్సాం రైఫిల్స్, ఆర్మీ రెజిమెంట్లు మైతేయి ప్రాంతాలు, కుకీలు, పైతీలు వంటి ఇతర గిరిజనులు నివసించే ప్రాంతాలకు మధ్య తటస్థ జోన్ లను సృష్టించాయి. దీనివల్ల తమ ఆధిపత్య ప్రాంతాన్ని విస్తరించడానికి కొన్ని సమయాల్లో ఏదో ఒక వర్గం చేసే ప్రయత్నాల వల్ల అస్థిరమైన శాంతి కొనసాగుతోంది. కాంగ్లీపాక్ తిరుగుబాటు వర్గాలకు చెందిన విçస్తృతమైన నెట్వర్క్ ఒకప్పుడు ఇంఫాల్ లోయను పీడించింది. గత రెండు దశాబ్దాల కాలంలో దాన్ని అణచిపెట్టారు. అది ఇప్పుడు పునరుజ్జీవితమైందనీ, రాష్ట్ర పోలీసు దళం నుండి ‘దోచు కున్న’ ఆయుధాలతో కొందరు సాయుధులయ్యారనీ తెలుస్తోంది. లొంగిపోయి, అస్సాం రైఫిల్స్ నిఘా కళ్ల నీడన, శిబిరాల్లో నివసిస్తున్న కొంతమంది కుకీ మిలిటెంట్లు కూడా ఇదే విధమైన కక్షతో తప్పించుకుని ఉండవచ్చు. కొండ జిల్లాల్లోని సాయుధ గ్రామ అప్రమత్త కమిటీలలో చేరి ఉండవచ్చు కూడా. యుద్ధంలో యుద్ధం సమూహాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రాష్ట్రంలో ‘యుద్ధంలో యుద్ధం’ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదే సమయంలో సాధారణ శాంతిభద్రతలను సద్వినియోగం చేసు కుంటూ దోపిడీ, తుపాకుల సేకరణ, మాదక ద్రవ్యాల వ్యాపారంలో కూడా మునిగిపోతున్నారు. చారిత్రకంగా ఇది వారికి అలవాటైన విద్యే. వీటి సాయంతోనే సాధారణ ప్రజలను లూటీ చేసేవారు. మణి పుర్లోని చిన్న మైతేయి ముస్లిం సమాజమైన పంగల్‌లను మైతేయి మిలిటెంట్ గ్రూప్ లక్ష్యం చేసుకోవడం పరిస్థితుల పతనానికి పరా కాష్టగా కనబడుతోంది. అయితే, జాతుల మధ్య సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు శాంతి కమిటీల ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ, రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. హింసను, సంక్షోభాన్ని పరిష్కరించ డంలో ప్రభుత్వ యంత్రాంగ అసమర్థత ఇప్పటికే కనీసం 180 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 40,000 మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. మయన్మార్ నుండి కుకీలు వెల్లువలా వచ్చి చేరడం, ఆ పొరుగు దేశంలో సంఘర్షణ ఫలితంగా ప్రవేశిస్తున్న శరణార్థులు కూడా మైతేయిల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా) తమ ఏకైక పోరాటం మయన్మార్ రాజ్యా నికి వ్యతిరేకంగానేననీ, మణిపుర్లో తాము ఎటువంటి కాల్పులకు పాల్పడలేదనీ పదేపదే ప్రకటనలు జారీ చేస్తూ వచ్చాయి. అయినా వారి సిబ్బందిలో కొందరు స్వతంత్ర పద్ధతిలో వ్యవహరించడాన్ని తోసిపుచ్చలేము. కుకీ కొండ ప్రాంతాలలో దాదాపు పూర్తిగా మైతేయిలకు చెందిన రాష్ట్ర పోలీసు కమాండోలను ఉంచడాన్ని మణిపుర్ ప్రభుత్వం బలపరుస్తున్నందుకు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లను, అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను స్థానిక వార్తాపత్రికలకు చెందిన ఇద్దరు సంపాద కులను అరెస్టు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దశలోనే హింసాకాండ జరిగింది. తరచుగా ఇంటర్నెట్ నిషేధాలు, ఇతర అవ రోధాల కారణంగా రిపోర్టింగ్ తీవ్రంగా నిరోధించబడిన రాష్ట్రంలో, తాజా అరెస్టులు ఏమాత్రం మంచివి కావు. సంఘర్షణ – స్నేహ చరిత్ర మణిపుర్లో సంఘర్షణలతో పాటు వర్గాల మధ్య స్నేహానికి కూడా సుదీర్ఘ చరిత్రే ఉంది. రాజులు ఇంఫాల్ లోయను పాలించినప్పుడు, నాగాలు, కుకీలు, ఇతర గిరిజనులు నివసించే కొండలపై వారి పట్టు చాలా తక్కువగా ఉండేది. గిరిజనులు కొండలను ‘సొంతం’ చేసుకున్నారు, తమ సొంత ఆచారాల ప్రకారం వారి జీవితాలను గడి పారు. రాజులు కూడా దానిని అంగీకరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మణిపుర్‌లోని మూడు ప్రధాన కమ్యూనిటీలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు కూడా సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ, వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు కూడా చేసుకున్నారు. తద్వారా సయోధ్యకు, శాంతికి అవకాశం ఏర్పడింది. 1944లో మూడు వర్గా లకు చెందిన యువకులు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. అది బర్మా నుండి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ వెనుకంజ వేయడంతో చాలామంది తిరిగి రంగూన్ కు వెళ్లారు. స్వాతంత్య్రం కోసం యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిలో మణిపుర్ మొదటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. పరిష్కారమేంటి? క్రైస్తవ మిషనరీలు కొండలపైకి తీసుకువచ్చిన విద్య మణిపుర్ గిరిజనుల సాధారణ శ్రేయస్సు స్థాయిని పెంచింది. షెడ్యూల్డ్ తెగ లుగా వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మరోవైపు, రాష్ట్రంలోనే అత్యుత్తమ సాగు భూమి ఇంఫాల్ లోయలో ఉంది. ఇది చారిత్రకంగా మైతేయిలు ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. గిరిజనులు తొమ్మిది రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్న కొండ ప్రాంతాలలో ఉన్నారు. కానీ వీటిలో సాగు యోగ్యమైనవి తక్కువ. జనాభాలో 53 శాతం ఉన్న మైతేయిలు వ్యవసాయం, పరిశ్ర మల్లో ముందంజలో ఉన్నారు. 2022లో ఎన్నికైన బీజేపీ నేతృత్వంలోని మణిపుర్ ప్రభుత్వం, కుకీ–జో ప్రజలు సాంప్రదాయ గిరిజన భూములుగా పిలిచే వాటిని రిజర్వుడ్ ఫారెస్టులుగా చెబుతూ వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసింది. అలా ఉద్రిక్తతకు అవకాశం ఏర్ప డింది. ఇక, గతేడాది మే ప్రారంభంలో మెజారిటీగా ఉన్న మైతేయి లకు షెడ్యూల్డ్ తెగ హోదాను కల్పించే చర్యకు పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా గిరిజన సమూహాలు చేసిన ప్రదర్శనల ద్వారా హింసకు నాంది పడింది. అయితే, ఈ చర్యలను ప్రభుత్వం విరమించుకుంది. కుకీ–జో ప్రజలు మయన్మార్ నుండి తమ బంధువులను తీసుకు వస్తున్నారనీ, రాష్ట్రాన్ని ముంచెత్తడం ద్వారా రాష్ట్ర జనాభా నిష్పత్తుల రీతిని మార్చుతున్నారనీ మైతేయిల ఆందోళన. మాదక ద్రవ్యాలు, తుపాకీల సేకరణతో మాదక ద్రవ్యాల వ్యాపారానికి గేట్లు ఎత్తారనీ వీరి ఆరోపణ. (వాస్తవానికి ఇరు వర్గాలకు చెందిన సాయుధ మిలిటెంట్లు ఈ లాభదాయక ‘వ్యాపారం’లో పాల్గొంటున్నారు.) నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. కాకపోతే దానికి మణిపూర్ కొండలు, లోయలలో కాల్పులు నిశ్శబ్దం కావలసి ఉంటుంది. రాష్ట్ర పోలీసులు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు కాబట్టి, ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఈశాన్య ప్రాంత మాజీ హెడ్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
‘నెల్సన్’ మొదలైంది
యంగ్ డైరెక్టర్ సునీల్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నెల్సన్’. ‘జయంత్’అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు మొదలయ్యాయి. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం
చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. సినీ రంగంలో డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. -
చిన్ని జయంత్ కుమారుడికి రజనీకాంత్ అభినందనలు
సాక్షి, చెన్నై: నటుడు చిన్ని జయంత్ కొడుక్కి సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన కై కొడుకుమ్ కై చిత్రం ద్వారా నటుడిగా చిన్ని జయంత్ సినీరంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలువురు ప్రముఖలతో కలిసి అనేక చిత్రాల్లో నటించాడు. కొన్ని చిత్రాలకు దర్శక నిర్మాతగానే బాధ్యతలను చేపట్టారు. చిన్ని జయంత్‌లో మంచి మిమిక్రీ కళాకారుడు ఉన్నాడన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న చిన్ని జయంత్‌కు సృజన్ జయ్ అనే కొడుకు ఉన్నాడు. (ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు) ఇతను ఇటీవల జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 75వ స్థానంలో నిలిచాడు. అలా తొలి అటెంప్్టలోనే సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులైన సృజన్ జయ్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. నటుడు రజినీకాంత్ తన ట్విట్టర్లో పేర్కొంటూ చిన్ని జయంత్ కొడుకు సృజన్ జయ్ తన తల్లిదండ్రులను గర్వపడేలా చేసినందుకు తాను గర్వపడుతున్నానన్నారు. లాక్ డౌన్ లేకుంటే తాను నేరుగా ఇంటికి వెళ్లి ఆయన కొడుకును అభినందించే వాడినని రజనీకాంత్ పేర్కొన్నారు. -
నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం
నెల్లూరు ,తడ: తన దర్శకత్వంలో తన కుమారుడు జయంత్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్ తెలిపారు. నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని చెన్నై వెళ్తూ మార్గమధ్యలో తడ చైతన్యమెస్‌లో భోజనం కోసం బుధవారం ఆగారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. తడ, సూళ్లూరుపేటతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. చిన్నతనంలో చెన్నైలో చదివే సమయంలో పలుమార్లు తడకు వచ్చానని తెలిపారు. చెంగాళమ్మ ఆలయానికి పలుమార్లు వచ్చానని వివరించారు. తాజాగా మరోసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నానన్నారు. ప్రస్తుతం ఫిట్ అనే సినిమాలో డిపార్ట్మెంట్ హెడ్‌గా నటించానని, సినిమాలో ఇది ఎంతో ముఖ్యమైన పాత్ర అన్నారు. సుమన్‌తో కలిసి ‘నువ్వే నా ప్రాణం’ అనే సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. బుల్లితెరలో నటించేందుకు సరిపడా సమయం ఉండటంలేదని, 67 ఏళ్ల వయసులో హార్డ్ వర్క్ చేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. తొలుత సినీ సంగీత దర్శకుడు తమన్ కూడా మెస్‌లో భోజనం చేశారు. -
తుది పోరులో భారత్‌కు నిరాశ
కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. అజేయంగా ఫైనల్ చేరిన భారత జట్టుకు తుదిపోరులో ఆతిథ్య శ్రీలంక జట్టు చేతిలో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో జయంత్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా... అతీత్ సేథ్ (15 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) 16 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. లీగ్ దశలో లంకను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ తుదిపోరులో ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. హసిథ బోయగొడ (54; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కమిందు మెండిస్ (61; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్ 2, షమ్స్ ములాని, మయాంక్ మార్కండే, జయంత్, నితీశ్ రాణా తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులకు పరిమితమైంది. జయంత్ యాదవ్ (71; 5 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... ములాని (46; 5 ఫోర్లు), నితీశ్ రాణా (40; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా జయంత్ మమ్మెన్ మాథ్యూ
సాక్షి, బెంగళూరు: 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనో రమ) ఎన్నికయ్యారు. శుక్రవారమిక్కడ జరిగిన సొసైటీ 79వ వార్షిక సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శైలేష్ గుప్తా (మిడ్ డే), వైస్ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలం (హెల్త్ అండ్ ది యాం టిసెప్టిక్), కోశాధికారిగా శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్), సెక్రటరీ జనరల్‌గా లవ్ సక్సేనా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా సాక్షి డైరెక్టర్ కె.రాజప్రసాదరెడ్డి ఎన్నికయ్యారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీష్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్), సంహిత్ బల్ (ప్రగతివాది), వి.కె.చోప్రా (దైనిక్ అసాం), విజయ్ కుమార్ చోప్రా (పంజాబీ కేసరి), కరణ్ రాజేంద్ర దార్దా (లోక్మత్), విజయ్ జవహర్లాల్ దార్దా (లోక్మత్), జగ్జీత్సింగ్ దార్ది (చర్హదికళ డైలీ), వివేక్ గోయెంక (ఇండియన్ ఎక్స్‌ప్రెస్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డేటాక్వెస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్), మోహిత్ జైన్ (ఎకనామిక్ టైమ్స్), సర్వీందర్ కౌర్ (అజిత్), సీహెచ్.కిరణ్ (విపుల, అన్నదాత), ఎంవీ శ్రేయమ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), ఆర్.లక్ష్మీపతి (దినమలర్), విలాస్ ఏ మరాఠే (దైనిక్ హిందుస్తాన్), హర్షా మాథ్యూ (వనిత), నరేష్ మోహన్ (సండే స్టేట్స్‌మన్), అనంత్ నాథ్ (గ్రిహ్శోభిక, మరాఠీ), సుమంత పాల్ (అమర్ ఉజాల), ప్రతాప్ జి పవార్ (సకల్), డీడీ పుర్కాయస్త (ఆనంద్ బజార్ పత్రిక), ఆర్ఎంఆర్ రమేశ్ (దినకరణ్), అతిదెబ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), కిరణ్ డి.ఠాకూర్ (తరుణ్ భరత్), బిజు వర్ఘీస్ (మంగళం వీక్లీ), రాజీవ్ వెర్మ (హిందుస్తాన్ టైమ్స్), వినయ్ వెర్మ (ది ట్రైబ్యూన్), బాహుబలి ఎస్ షా (గుజరాత్ సమాచార్), హోర్ముస్జీ ఎన్ కామా (బాంబే సమాచార్ వీక్లీ), కుందన్ ఆర్ వ్యాస్ (వ్యాపార్), కె.ఎన్.తిలక్ కుమార్ (డెక్కన్ హెరాల్డ్ అండ్ ప్రజావాణి), రవీంద్రకుమార్ (ది స్టేట్స్‌మన్), కిరణ్ బి వడోదారియా (సంభవ్ మెట్రో), పి.వి.చంద్రన్ (గృహలక్ష్మి), సోమేశ్ శర్మ (రాష్ట్రదూత్ సప్తాహిక్), అకిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్) ఉన్నారు. -
ప్రేమ విలువైనది
‘‘కొందరివల్ల ప్రేమ పలుచన అవుతున్నా కూడా, ప్రేమ ఎప్పుడూ విలువైనదే. ఆ నేపథ్యంలోని ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శకుడు చెన్ని చిరంజీవి చెప్పారు. అంజనీకుమార్, రోహన్, ప్రియాంక, భవ్య కాంబినేషన్లో దుర్గాదేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మూలాస్వామి నిర్మిం చిన ‘ప్రేమ లేదని’ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో నిర్మాత మాట్లాడుతూ -‘‘మనాలిలో అద్భుతమైన లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించాం’’ అన్నారు. యువతకు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయని హీరో హీరోయిన్లు తెలిపారు. -
'శివ కేశవ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్
శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘శివకేశవ’. ఆర్.వి.సుబ్రమణ్యం దర్శకుడు. నాగరాజు బానూరి (జడ్చర్ల) నిర్మాత. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇటీవల జరిగింది. -
శివకేశవ్లు రెడీ అవుతున్నారు
శ్రీహరి, జయంత్ హీరోలుగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘శివకేశవ్’. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో బానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మించారు. సంజన, శ్వేతాబసుప్రసాద్, గుర్లిన్ చోప్రా కథానాయికలు. ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌కి సిద్ధమైన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బానూరు నాగరాజు మాట్లాడుతూ -‘‘ఓ కొత్త కోణంలో ఉండే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శ్రీవసంత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. శ్రీహరి నటన, పోరాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నటుడు భానుచందర్ తనయుడు జయంత్ అద్భుతంగా నటించాడు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. మా సంస్థకు శుభారంభాన్నిచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బానూరు శ్రావణి-సాయినాధ్, సహనిర్మాత: బానూరు మాలతి. -
భానుచందర్ కొడుకు బంగారం
తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత. వచ్చే నెలలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి భానుచందర్ మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కి తగ్గట్టుగా కథ ఉంటుంది. థ్రిల్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిసిన కథ ఇది. నా చిరకాల మిత్రుడు బూచితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. అక్టోబర్ చివరివారంలో ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుంది’’ అని తెలిపారు. సుమన్, సుహాసినీ మణిరత్నం, బ్రహ్మానందం, నాజర్, సీత, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ముఖేష్‌రుషి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించనున్నారు. -
‘శివకేశవ్’కు అన్నీ కుదిరాయి
‘‘ఇది మంచి యాక్షన్ ఎంటర్టైనర్. కథతో పాటు మాటలు, పాటలు, యాక్షన్ కూడా బాగా కుదిరాయి. శ్రీహరి నటన ఈ సినిమాకు మెయిన్ పిల్లర్’’ అని దర్శకుడు ఆర్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. శ్రీహరి, జయంత్, శ్వేతాబసుప్రసాద్, సంజన, గుర్లిన్ చోప్రా ప్రధాన తారాగణంగా సీతారామ ఫిలిమ్స్ పతాకంపై బానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మిస్తున్న చిత్రం ‘శివకేశవ్’. ఈ నెల రెండోవారంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. శ్రీవసంత్ వినసొంపైన సంగీతాన్నందించారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని తెలిపారు. -
ప్రియా... నీ మీదే ఆశగా
పృథ్వీప్రసాద్, ముంతాజ్, దివ్యప్రతిభ ముఖ్య తారలుగా ప్రసాద్‌బాబు, మధుబాబు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రియా... నీ మీదే ఆశగా’. కిషన్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జయంత్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్. విద్యాసాగర్‌రావు సీడీ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. అతిథులుగా పాల్గొన్న వి. సముద్ర, ఘంటాడి కృష్ణ, ఆజాద్ తదితరులు పాటలు, సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. దర్శకుడిగా ఇది తొలి చిత్రమని, పాటలు బాగా కుదిరాయని కిషన్‌రాజ్ తెలిపారు. పాటలన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా ఉంటాయని జయంత్ చెప్పారు. ‘‘లవ్, యాక్షన్, కామెడీ సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది. ఏడు పాటలూ బాగుంటాయి. గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’ అని నిర్మాతలు చెప్పారు.