నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం | Bhanu Chander Movie Direction With his Son Jayanth in may | Sakshi
Sakshi News home page

నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం

Published Thu, Feb 27 2020 12:40 PM | Last Updated on Thu, Feb 27 2020 12:40 PM

Bhanu Chander Movie Direction With his Son Jayanth in may - Sakshi

మాట్లాడుతున్న భానుచందర్‌

నెల్లూరు ,తడ: తన దర్శకత్వంలో తన కుమారుడు జయంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌ మేలో ప్రారంభం కానుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్‌ తెలిపారు. నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని చెన్నై వెళ్తూ మార్గమధ్యలో తడ చైతన్యమెస్‌లో భోజనం కోసం బుధవారం ఆగారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. తడ, సూళ్లూరుపేటతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. చిన్నతనంలో చెన్నైలో చదివే సమయంలో పలుమార్లు తడకు వచ్చానని తెలిపారు. చెంగాళమ్మ ఆలయానికి పలుమార్లు వచ్చానని వివరించారు.

తాజాగా మరోసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నానన్నారు. ప్రస్తుతం ఫిట్‌ అనే సినిమాలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా నటించానని, సినిమాలో ఇది ఎంతో ముఖ్యమైన పాత్ర అన్నారు. సుమన్‌తో కలిసి ‘నువ్వే నా ప్రాణం’ అనే సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. బుల్లితెరలో నటించేందుకు సరిపడా సమయం ఉండటంలేదని, 67 ఏళ్ల వయసులో హార్డ్‌ వర్క్‌ చేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. తొలుత సినీ సంగీత దర్శకుడు తమన్‌ కూడా మెస్‌లో భోజనం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement