bhanu chander
-
నా జీవితంలో చేసిన పెద్ద తప్పు డ్రగ్స్ కి బానిస అవ్వడం
-
మా నాన్నగారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్..!
-
అనుకోకుండా యాక్టర్ అయ్యా.. అతనే నా గాడ్ ఫాదర్: సుమన్
కిరణ్‌రాజ్, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నువ్వే నా ప్రాణం'. ఈ సినిమాలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్‌పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. భానుచందర్ మాట్లాడుతూ... 'సివిల్ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు ఆయన. సెట్స్‌లో కూడా ఎన్ని పనులు ఉన్నా చాలా బాగా పనిచేసేవారు. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ... 'సడెన్‌గా నేను యాక్టర్ అయ్యా. ఇన్నేళ్ల నా సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించా. నాకు మొదటిసారి అవకాశాన్ని ఇచ్చిన నా గాడ్ ఫాదర్ రామన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే తర్వాత నా గాడ్ బ్రదర్ భానుచందర్ అని చెప్పాలి. ఆయన నాకు తెలుగు రాకపోయినా ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను కన్నడ చిత్రాల్లోనే కాక తెలుగు సినిమాల్లో నటించేలా చేశారు. నేను భానుచందర్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులం. అందువల్ల ఎక్కువ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. హీరో, హీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు. అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది: భాను చందర్
పుష్ప సినిమా సమంత వల్లే హిట్ అయ్యింది ప్రముఖ నటుడు, సీనియర్ హీరో భానుచందర్ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన అవును అన్నారు. ‘ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నో సౌత్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ అంతేందుకు ఇటీవల రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో చూశాం కదా. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్. సమంత నటించిన ఈ పాట తమిళం, మాళయాళంలో కూడా మారుమోగింది’ అన్నారు. అనంతరం ఆయన ఎలాంటి వారైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఎంతపెద్ద సెలబ్రెటీలు అయినా, వారి ఎంతటి పేరు ప్రతిష్టలు ఉన్నా అవి మనల్ని కాపాడలేవన్నారు. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. -
‘సేవాదాస్’లో నటించడం గర్వంగా ఉంది: సుమన్, భానుచందర్
సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ కీలక పాత్రలు పోషించిన బహుభాష చిత్రం 'సేవదాస్'. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కెపీఎన్ చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, రేఖా నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని షురూ చేసింది. తాజాగా సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్‌తో పాటు మూవీ టీమ్ అంతతా మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ‘సేవాదాస్’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్’ చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "సేవాదాస్" సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ... "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు. -
Sevadas: శత దినోత్సవ వేడుకలా ఉంది: మంత్రి తలసాని
సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం‘సేవాదాస్’.కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ బానోత్, రేఖా శ్యామ్ నాయక్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, రాములు నాయక్, రవీంద్ర నాయక్, రాథోడ్ బాబూరావులతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... ‘ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. ‘సేవాదాస్’ చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి’అన్నారు. బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన "సేవాదాస్" ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది’అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ... " "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం అందించారు. -
'చంద్రబాబు నైజం ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు'
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచమని సినీ నటుడు భానుచందర్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం దారుణం. చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్ ఆనాడే స్ఫష్టంగా చెప్పారు. ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తే చంద్రబాబుకు పుట్టగతులుండవు. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’) వైఎస్ జగన్ సంక్షేమపథకాలతో ప్రజలకి దగ్గర కావడం సహించలేకపోతున్నారు. అందుకే ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్లు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లు సీఎంగా వైఎస్ జగన్ కొనసాగుతారు' అని సినీ నటుడు భానుచందర్ పేర్కొన్నారు. చదవండి: (టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు) -
నా దర్శకత్వంలో సినిమా ప్రారంభం
నెల్లూరు ,తడ: తన దర్శకత్వంలో తన కుమారుడు జయంత్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్ తెలిపారు. నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని చెన్నై వెళ్తూ మార్గమధ్యలో తడ చైతన్యమెస్‌లో భోజనం కోసం బుధవారం ఆగారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. తడ, సూళ్లూరుపేటతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. చిన్నతనంలో చెన్నైలో చదివే సమయంలో పలుమార్లు తడకు వచ్చానని తెలిపారు. చెంగాళమ్మ ఆలయానికి పలుమార్లు వచ్చానని వివరించారు. తాజాగా మరోసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నానన్నారు. ప్రస్తుతం ఫిట్ అనే సినిమాలో డిపార్ట్మెంట్ హెడ్‌గా నటించానని, సినిమాలో ఇది ఎంతో ముఖ్యమైన పాత్ర అన్నారు. సుమన్‌తో కలిసి ‘నువ్వే నా ప్రాణం’ అనే సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. బుల్లితెరలో నటించేందుకు సరిపడా సమయం ఉండటంలేదని, 67 ఏళ్ల వయసులో హార్డ్ వర్క్ చేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. తొలుత సినీ సంగీత దర్శకుడు తమన్ కూడా మెస్‌లో భోజనం చేశారు. -
కొత్త కొత్తగా...
సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్ ప్రధాన తారలుగా ఓ చిత్రం ప్రారంభమైంది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా.పర్వతరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలించాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు భానుచందర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇటీవల వస్తున్న సినిమాలకు భిన్నంగా కొత్త కథతో మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు, నిర్మాత శేఖర్‌రెడ్డి, డైరెక్టర్ బి. వేణు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీపతి, శ్రీనివాస్‌గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు, సంగీతం: ఉదయ్‌కిరణ్. -
అలా డైరెక్టర్ అయ్యాను
‘‘ప్రసాద్‌గారికి ‘నటన’ కథ చెప్పాను. నచ్చింది కానీ, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్‌కి భానుచందర్‌గారి పేరుని నిర్మాతగారే చెప్పారు. ఆయన్ని కలవగానే సినిమా చేయడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అని డైరెక్టర్ భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా భవిరిశెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నటన’. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నటులు శివాజీరాజా, భానుచందర్ విడుదల చేశారు. కుబేర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటన’ గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. భారతీబాబు చక్కగా తెరకెక్కించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ పాటని పాడి, సంగీతం అందించాను. మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఎం.ఎం.శ్రీలేఖ. ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు భానుచందర్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్, నటుడు కాశీ విశ్వనాథ్, గురుచరణ్, రఘు, మహిధర్, శ్రావ్యారావు తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 22న 'తొలి కిరణం' రిలీజ్
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో T. సుధాకర్ నిర్మాత గా జె. జాన్ బాబు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తొలి కిరణం చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు సినిమాలో ఇప్పటి వరకు రాని కొత్త పాయింట్ తో మా చిత్రాన్ని నిర్మిచాం. 45 నిమిషాలు అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యింది. మా చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అదించటం సినిమా పై అంచనాలు పెంచింది. ఆయన అద్భుతమైన పాటలు అందిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మలయాళ నటి భవ్య మేరీ మాతగా నటించింది. 'తొలి కిరణం' చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. -
ప్రతిభను ప్రోత్సహిస్తే ఏపీ నంబర్‌వన్
సినీ నటుడు భానుచందర్ ఘనంగా మదర్‌థెరిసా జయంతి వేడుకలు నెల్లూరు(బారకాసు) : వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్న వారిని ప్రోత్సహిస్తే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది దేశంలో నంబర్‌వన్‌గా గుర్తింపు పొందుతుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్ అన్నారు. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని టౌన్‌హాల్ (పురమందిరం)లో నిర్వహించిన మదర్‌థెరిసా 106వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళారంగాన్ని కాపాడుకుంటేనే సమాజం అన్ని విధాల అభివృద్ది చెందుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళారంగమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఎందరో ప్రతిభ కలిగిన వారున్నారన్నారు. కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ అధినేత గాలి కిరణ్‌కుమార్ అభినందనీయుడని కొనియాడారు. దర్శకుడు పురుషోత్తంరావు మాట్లాడుతూ కళారంగమంటే తనకెంతో ఇష్టమని అందుకనే సినిమా రంగంలోకి ప్రవేశించానన్నారు. భానుచందర్ తననెంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కనుమరుగవుతున్న కళారంగాన్ని కాపాడలనే తపనతోనే తన వంతు ప్రోత్సహం అందిస్తున్నానని చెప్పారు. అనంతరం భానుచందర్, పురుషోత్తంను గజమాల, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో చిత్త శుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న సీతారామయ్య, శ్రీరామప్రసాద్, యంట్రపాటి వెంకటేశ్వర్లు, కాలిశెట్టి శ్రీనివాసులు, మామిడి పుష్పకళ, పఠాన్ యస్దాన్ఆలి, వివిధ రంగాల్లో తమ ప్రతిభన కనబరుస్తున్న సర్వేపల్లి రామ్మూర్తి, విష్ణువర్దన్, కాలిశెట్టిలకు పురస్కారాలు అందజేశారు. అమరావతి కృష్ణారెడ్డి పేద వృద్ధ కళాకారులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. తొలుత నిర్వహించిన పాటలు, డ్యాన్సు పోటీల్లో విజేతలైన వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను ఆలరించాయి. కార్యక్రమంలో కావలి మార్కెట్ కమిటి చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, శ్రీడ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీనివాసులురెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, గడ్డం సుధాకర్‌రెడ్డి, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, రిటైర్డ్ లెక్చరర్ డేగా రామచంద్రారెడ్డి, పాటూరు శ్రీనివాసులు, ఎస్.వి రమేష్, చక్రధర్, అమానుల్లాఖాన్, తుమ్మల శ్రీనివాసులురెడ్డి, బయ్యా వాసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక పాత్రలో...
ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సమాజంలోని అవినీతిపై ఎలా యుద్ధం చేశాడనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘రుద్ర ఐపీఎస్’. అంజన్‌కుమార్ చెరుకూరి దర్శకత్వంలో అజిత్ క్రియేషన్ పతాకంపై రాజ్‌కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. కీర్తన పొదువాల్ కథానాయిక. ప్రత్యేక పాత్రలో భానుచందర్ నటిస్తున్నారు. వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అంజన్‌కుమార్ చెప్పారు. నిజాయతీ గల రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నానని భానుచందర్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్. మూర్తి, సమర్పణ: టి.కృష్ణవేణమ్మ. -
మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్...
రోజులు మారాయి చిత్రానికి ఈ సంవత్సరం 60 వసంతాలు నిండాయి. ఆ చిత్రంలో ‘ఏరువాకా సాగాలోరన్నో చిన్నన్నా’ పాటను కేవలం డప్పు మీద స్వరపరిచారు మాస్టర్ వేణు. వారి పెద్ద కుమారుడు మూర్తి చందర్, తండ్రిగారికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. నేను పుట్టింది మచిలీపట్టణంలో. కాని పెరిగిందంతా మద్రాసులోనే. నేను పుట్టే సమయానికి నాన్నగారు సినిమాలలో చాలా బిజీగా ఉండేవారు. 1950 - 1960 మధ్య సినీ పరిశ్రమకు స్వర్ణయుగం. దర్శకులు, నటులు, సాహిత్యం, సంగీతం... ఒకటేమిటి అన్ని రంగాలకూ పట్టాభిషేకం జరిగిన రోజులు. సంగీత దర్శకులంతా ఎవరి శైలిలో వారు కళామతల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చారు. అందులో నాన్న కూడా. తనదైన శైలిలో పాటలు చేస్తూ పూర్తిగా పాటల రికార్డింగులో బిజీగా ఉండేవారు. ఆ పది పదిహేను సంవత్సరాలు సంగీత కళామతల్లికి స్వరార్చన నిత్యం చేశారు నాన్న. ఆ తరవాత సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో 1965 తర్వాత ఆయనకు సినిమాలు బాగా తగ్గాయి. మూడేళ్లకో సినిమా వచ్చేది విశ్రాంతి సమయం ఎక్కువ దొరికింది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండేవారు. మాతో చక్కగా ఆడేవారు. నాన్నతో ఆడుకోవడమే మాకు మధురానుభూతి. నాన్నది పసిపిల్లవాడి తత్త్వం. ఎక్కువగా మాతో గాలిపటాలు, క్రికెట్, బొంగరాలు, కర్రబిళ్ల ఆడేవారు. ఆయనతో కలిసి ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్లం. నాన్నకి సంగీతం తప్పించి ఇంకే విషయాలూ తెలియవు. అందువల్ల మా చదువు బాధ్యత అంతా మా అమ్మగారే తీసుకున్నారు. చదువుకోమని అమ్మ చెబుతుంటే అమ్మ మీద కోపం వస్తుండేది. నాన్న మాతో సమానంగా ఆడుతుండేవారు. అందుకని నాన్నమీద ఇష్టంగా ఉండేది. కాని పెద్దయిన తర్వాత అమ్మ ఎందుకలా కేకలేసిందో అర్థమైంది. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువులో చేరాం. నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ప్రోత్సహించలేదు. నేను, తమ్ముడు భానుచందర్ ఇద్దరం బి. ఏ పూర్తి చేశాం. భాను గిటార్, నేను పియానో వాయించేవాళ్లం. నాన్నగారికి బహూకరించిన పియానో నా దగ్గరే ఉంది. దాని మీద ఇప్పటికీ నేను వాయిస్తూనే ఉంటాను. అమ్మ నన్ను మెడిసిన్ చదివించాలనుకుంది. కాని నాకు సంగీతం మీద శ్రద్ధ ఏర్పడి, మ్యూజిక్ డిప్లమా చేశాను. నాకు సహజంగా సిగ్గు బిడియం ఎక్కువ. అందువల్ల నాన్నతో స్టూడియోలకి వెళ్లేవాడిని కాను. కాని భాను మాత్రం నాన్నతో వెళ్లి, ఆయన పాటలకు గిటార్ వాయిస్తుండేవాడు. అలాగే రెండు సినిమాలకు సంగీతం కూడా చేశాడు. నేను హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. రాజ్ కోటి ఇద్దరూ విడివిడిగా ట్యూన్లు చేయడం మొదలుపెట్టాక, నేను రాజ్ దగ్గర అసోసియేట్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. తమ్ముడు యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అది కూడా అమ్మ అనుమతితోనే. నాన్నగారు వద్దని పట్టుబట్టినప్పటికీ అమ్మ పూర్తిగా ప్రోత్సహించింది. 1980లలో భానుచందర్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. తరంగిణితో హిట్ అయ్యాడు. అది చూసి నాన్న సంతోషించారు. బ్రేక్ వచ్చిందని ఆనందపడ్డారు. నా గురించి ఆయనకి ఎప్పుడూ బాధగా ఉండేది. నేను ఫిలాసఫీ వైపు మొగ్గుచూపాను. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయాను. జిడ్డు కృష్ణమూర్తి షౌండేషన్‌లో వలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాలను నేను తెలుగులో రికార్డు చేస్తున్నాను. 1981లో నాన్నగారు గతించారు. అమ్మ చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం వల్లే ఇల్లు కొనుక్కోగలిగాం. విజయావాహినీ సంస్థలో మ్యూజిక్ ఆరేంజర్గా, మ్యూజిక్ కండక్టర్‌గా పనిచేశారు మాస్టర్ వేణు. ఘంటసాల సంగీతం స్వరపరచిన ‘పాతాళభైరవి’ సినిమాకి రీరికార్డింగ్ పని మాస్టర్ వేణు చేశారు. అప్పట్లో విజయా వాహినీ వారు హ్యామండ్ ఆర్గాన్ తెప్పించారు. అయితే దానిని వాడటం ఎవ్వరికీ తెలియలేదు. మా నాన్నగారు దానితో ఎక్స్పరిమెంట్ చేసి, పాతాళభైరవి సినిమా అంతా ఆ వాద్యంతోనే రీరికార్డింగ్ చేశారు. అదే ప్రధానమైన వాద్యపరికరం. విజయవాహినీ స్టూడియోలో మానేసి బయటకు వస్తున్న సందర్భంలో వారు, నాన్నగారికి బహుమతిగా పియానో బహూకరించారు. ఇది విజయవాహినీ వారు బహూకరించిన వాద్యం. దానిని నేను అపూరూపంగా చూసుకుంటాను. నేటికీ దాని మీద వాయిస్తుంటాను. - మూర్తి చందర్ (మాస్టర్ వేణు పెద్ద కుమారుడు, ఫోన్ 09952926552) - సంభాషణ, ఫొటోలు: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
హ్యాపీ బర్త్ డే- 31-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భానుచందర్ (నటుడు), బ్రూక్ షీల్డ్స్(హాలీవుడ్ నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఈ సంవత్సరం వీరికి అత్యంత ప్రభావవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎంతోకాలంగా పరిశ్రమలు స్థాపించాలను కుంటున్న వారి కల నెరవేరుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలు లాభాల బాట పడతాయి. అయితే రాహుప్రభావం వల్ల కొన్ని గుర్తు తెలియని అనారోగ్యాలు పీడించవచ్చు. ఎం.బి.ఎ, ఎంసిఎ చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది. లీగల్ సర్వీసులలో ఉన్న వారికి మంచి పేరుతోబాటు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదన్నట్లు... వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అవసరం. లేదంటే చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అనాథలకు అన్నదానం, ఆవులకు, నల్లకుక్కలకు ఆహారం తినిపించాలి. శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం జరిపించాలి. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
జగన్నాయకుడొస్త్తున్నాడు!
మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి. -
జన్మజన్మల బంధం మూవీ స్టిల్స్
-
భానుచందర్ కొడుకు బంగారం
తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత. వచ్చే నెలలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి భానుచందర్ మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కి తగ్గట్టుగా కథ ఉంటుంది. థ్రిల్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిసిన కథ ఇది. నా చిరకాల మిత్రుడు బూచితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. అక్టోబర్ చివరివారంలో ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుంది’’ అని తెలిపారు. సుమన్, సుహాసినీ మణిరత్నం, బ్రహ్మానందం, నాజర్, సీత, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ముఖేష్‌రుషి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించనున్నారు. -
రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి! ‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి. సెప్టెంబర్ 8, ఫన్డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం. నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు. తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు. - పులగం చిన్నారాయణ -
పులివెందుల పులి బిడ్డ
ఓ ప్రేమికుడు ఫ్యాక్షనిస్ట్‌గా మారి, ఫ్యాక్షన్ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే కథాంశంలో రూపొందుతోన్న చిత్రం ‘పులివెందుల పులి బిడ్డ’. టి.గోపాలకృష్ణ దర్శకుడు. కళావతి ఫిలిమ్స్ పతాకంపై పెర్నపాటి శ్రీవిష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రహ్లాద్, పూజ, భానుచందర్, జయప్రకాష్‌రెడ్డి, సత్యం రాజేష్, లావణ్యలహరి, స్వాతిప్రియ ఇందులో ముఖ్యతారలు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చివరి షెడ్యూలు షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాం. ‘కక్షలూ కార్పణ్యాలూ వద్దు... ప్రేమాభిమానాలే ముద్దు’ అనే సందేశంతో ఈ చిత్రం తయారవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: సుధాకర్‌రెడ్డి.