పుష్ప మూవీ సమంత వల్లే హిట్‌ అయ్యింది: భాను చందర్‌ | Bhanu Chander Interesting Comments On Pushpa Success And Samantha | Sakshi
Sakshi News home page

Bhanu Chander: పుష్ప మూవీ సమంత వల్లే హిట్‌ అయ్యింది

Published Wed, May 25 2022 9:14 PM | Last Updated on Wed, May 25 2022 10:07 PM

Bhanu Chander Interesting Comments On Pushpa Success And Samantha - Sakshi

పుష్ప సినిమా సమంత వల్లే హిట్‌ అయ్యింది ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో భానుచందర్‌ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ను టాలీవుడ్‌ ఓవర్‌ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్‌ అడగ్గా.. ఆయన అవును అన్నారు. ‘ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నో సౌత్‌ సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో తెలిసిందే.

చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్‌ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్‌

అంతేందుకు ఇటీవల రిలీజ్‌ అయిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో చూశాం కదా. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్‌ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్‌. సమంత నటించిన ఈ పాట తమిళం, మాళయాళంలో కూడా మారుమోగింది’ అన్నారు. అనంతరం ఆయన ఎలాంటి వారైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఎంతపెద్ద సెలబ్రెటీలు అయినా, వారి ఎంతటి పేరు ప్రతిష్టలు ఉన్నా అవి మనల్ని కాపాడలేవన్నారు. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement