పులివెందుల పులి బిడ్డ
పులివెందుల పులి బిడ్డ
Published Tue, Sep 17 2013 1:21 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఓ ప్రేమికుడు ఫ్యాక్షనిస్ట్‌గా మారి, ఫ్యాక్షన్ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే కథాంశంలో రూపొందుతోన్న చిత్రం ‘పులివెందుల పులి బిడ్డ’. టి.గోపాలకృష్ణ దర్శకుడు. కళావతి ఫిలిమ్స్ పతాకంపై పెర్నపాటి శ్రీవిష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రహ్లాద్, పూజ, భానుచందర్, జయప్రకాష్‌రెడ్డి, సత్యం రాజేష్, లావణ్యలహరి, స్వాతిప్రియ ఇందులో ముఖ్యతారలు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చివరి షెడ్యూలు షూటింగ్ జరుగుతోంది.
వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాం. ‘కక్షలూ కార్పణ్యాలూ వద్దు... ప్రేమాభిమానాలే ముద్దు’ అనే సందేశంతో ఈ చిత్రం తయారవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: సుధాకర్‌రెడ్డి.
Advertisement
Advertisement