టాలీవుడ్‌ మూవీ సెట్‌లో ఆయుధ పూజ.. వీడియో వైరల్ | Nikhil Latest Movie Swayambhu Team Ayudha Pooja In Sets | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ మూవీ సెట్‌లో ఆయుధ పూజ.. వీడియో వైరల్

Published Fri, Oct 11 2024 2:55 PM | Last Updated on Fri, Oct 11 2024 3:07 PM

Nikhil Latest Movie Swayambhu Team Ayudha Pooja In Sets

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభూ. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా మూవీ టీమ్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా షూటింగ్ సెట్‌లో ఆయుధ పూజ నిర్వహించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ చిత్రంలో ఉపయోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది. కాగా.. ఈ దీపావళికి నిఖిల్ సైతం థియేటర్లలో సందడి చేయనున్నాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement