లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'అనంతం'.. టీజర్ రిలీజ్‌ చేసిన టాలీవుడ్ హీరో! | Tollywood Hero Nikhil Siddhartha released Anantham Movie Teaser | Sakshi
Sakshi News home page

Anantham Movie Teaser: లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'అనంతం'.. టీజర్ రిలీజ్!

Published Sun, Oct 27 2024 9:27 PM | Last Updated on Sun, Oct 27 2024 9:29 PM

Tollywood Hero Nikhil Siddhartha released Anantham Movie Teaser

వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం తాజా చిత్రం "అనంతం". ఈ సినిమాలో రుచిత సాధినేని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీని టీజర్ విడుదల చేశారు మేకర్స్. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ ‍అద్భుతంగా ఉందని నిఖిల్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  కాగా.. ఈ చిత్రంలో  రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ - 'మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్‌గా మూవీ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తాం' అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement