![Tollywood New Movie Ms ilayaa Pooja Ceremony](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/ms-ilaya_0.jpg.webp?itok=XKOiRHoi)
టాలీవుడ్‌లో 'మిస్ ఇళయా' (Ms. ILAYAA) అనే ప్రత్యేకమైన టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి మట్టా శ్రీనివాస్, చాహితీ ప్రియా నిర్మాతలుగా ఉన్నారు. వేముల జి దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు అవుతుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇలాంటి పాత్రలో చేయడం ఇదే మొదటిసారి. ఇది నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం కల్పించే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాను' అని తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_441.jpg)
డైరెక్టర్ వేముల జి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం వినూత్నమైన కథతో తెరకెక్కుతుంది. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మేము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నాము' అని అన్నారు.
ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సహ నిర్మాత చాహితీ ప్రియతో మా బ్యానర్ 'కాస్మిక్ పవర్ ప్రొడక్షన్'పై వస్తున్న ఈ చిత్రం కోసం ఎంతో అన్వేషణ చేసి, మంచి కథను ఎంపిక చేసుకున్నాం. సినిమాకు అనుగుణంగా ఉన్న సాంకేతిక బృందం, ప్రతిభావంతమైన నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది' అని తెలిపారు. 'మిస్ ఇళయా' సినిమా తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment