
‘‘ప్రసాద్‌గారికి ‘నటన’ కథ చెప్పాను. నచ్చింది కానీ, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్‌కి భానుచందర్‌గారి పేరుని నిర్మాతగారే చెప్పారు. ఆయన్ని కలవగానే సినిమా చేయడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అని డైరెక్టర్ భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా భవిరిశెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నటన’.
ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నటులు శివాజీరాజా, భానుచందర్ విడుదల చేశారు. కుబేర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటన’ గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. భారతీబాబు చక్కగా తెరకెక్కించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ పాటని పాడి, సంగీతం అందించాను. మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఎం.ఎం.శ్రీలేఖ. ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు భానుచందర్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్, నటుడు కాశీ విశ్వనాథ్, గురుచరణ్, రఘు, మహిధర్, శ్రావ్యారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment