
అలీ, న్యాయమూర్తి నందా, శ్రీలేఖ, కోటి, విజయేంద్రప్రసాద్
‘‘చిన్నప్పుడు నేను శ్రీలేఖకు ఒక ఆశ చూపించాను. ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరించింది. శ్రీలేఖ అన్న కీరవాణి సంగీతంలో ఆస్కార్ రేసులో ఉన్నారు. తన అన్నలానే శ్రీలేఖ కూడా ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలి’’ అన్నారు రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్. ‘నాన్నగారు’ (1994) సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమైన శ్రీలేఖ ఇప్పటి వరకూ 5 భాషల్లో 80 చిత్రాలకుపైగా సంగీతం అందించారు.
ఆమె సినిమా రంగంలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 దేశాల్లో 25మంది సింగర్స్‌తో ఈ నెల 17 నుంచి ‘వరల్డ్ మ్యూజిక్ టూర్’ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment