జగన్నాయకుడొస్త్తున్నాడు!
మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు.
కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి.