Jagannayakudu
-
జగన్నాయకుడొస్త్తున్నాడు!
మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి. -
5న ‘జగన్నాయకుడు’ రిలీజ్
సెన్సార్ బోర్డు వేధించింది: దర్శకుడు చంద్రశేఖర్‌రెడ్డి నంద్యాల: ‘జగన్నాయకుడు’ విడుదలకు సర్టిఫికెట్ ఇవ్వకుండా సెన్సార్ బోర్డు వేధించిందని, అడ్డంకులను అధిగమించి ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆవరణలో ‘ఆడవే మయూరి’ చిత్ర ప్రారంభోత్సవ పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈనెల 5న చిత్రం విడుదలకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. -
మూడు తరాల కథతో...
‘‘మా ‘జగన్నాయకుడు’ చిత్రం ఎప్పుడో విడుదల కావాలి. కానీ, సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది’’ అని వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. గతంలో పీసీ రెడ్డితో ‘భోగ భాగ్యాలు’వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరెడ్డి మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం నిర్మించారు. రాజా, పరిణిక, మమతా రావత్, శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్లు ముఖ్య తారలు. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ -‘‘ఢిల్లీలో ట్రిబ్యునల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ దక్కించుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రజాసంక్షేమానికై తపించిన తాత... ఆ బాటలోనే పయనిస్తూ ఒక వైద్యునిగా, జన హృదయనేతగా ప్రజల హృదయాల్లో చెరగని సంతకాన్ని లిఖించిన తనయుడు... తాతనూ, తండ్రినే ఆదర్శంగా తీసుకొని నవ శకానికి నాంది పలికిన మనవడు... ఈ ముగ్గురి జీవితమే ‘జగన్నాయకుడు’ చిత్రం. ఏ నేతకూ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కథ కాదిది. ఎవర్నీ బాధపెట్టే విధంగా ఉండదు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో విలువైన రాజకీయా లెలా ఉండాలి? అని సందేశ మిచ్చే చిత్రం’’ అని తెలిపారు. -
అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు
‘‘గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా ‘భోగభాగ్యాలు’ సినిమా తీశాను. ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మూడు తరాల కథ ఇది. రాజకీయ నేపథ్యం ఉండదు’’ అని నిర్మాత వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. రాజా, సుమన్, భానుచందర్ కాంబినేషన్లో పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో వట్లూరి శకుంతల రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న ‘జగన్నాయకుడు’ పాటల సీడీని శుక్రవారం హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘ఈ నెల 25న చెన్నైలో నా వివాహం జరుగనుంది. 30న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ‘జగన్నాయకుడు’ పాటలు విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఇది అందరూ మెచ్చుకునే సినిమా అవుతుందని పి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని భానుచందర్ చెప్పారు. -
జగన్నాయకుడు మూవీ ఆడియో లాంచ్
-
తాత-తండ్రి-మనవడి కథ
ప్రజాసంక్షేమానికై తపించే తండ్రి. ఆ బాటలోనే పయనిస్తూ... ఒక వైద్యునిగా, జన హృదయనేతగా ప్రజల హృదయాల్లో చెరగని సంతకాన్ని లిఖించిన తనయుడు. తాత, తండ్రి.. వీరినే ఆదర్శంగా తీసుకొని నవ శకానికి నాంది పలికిన మనవడు. ఈ ముగ్గురి జీవితాలే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా హీరోగా నటించిన ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రధారులు. పరిణిక, మమతా రావత్ కథానాయికలు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాకథ ఏ నేతకు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పల్లెటూరి చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన పి.చంద్రశేఖరరెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: వల్లూరి శకుంతలమ్మ. -
మూడు తరాల కథతో జగన్నాయకుడు
కృష్ణ, శ్రీదేవి జంటగా పీసీ రెడ్డి దర్శకత్వంలో గతంలో ‘భోగభాగ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రం నిర్మించిన వీఏ పద్మనాభరెడ్డి ప్రస్తుతం ‘జగన్నాయకుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా పీసీ రెడ్డి దర్శకుడు. రాజా, మమతారాహుల్, శిరీష ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం పాట చిత్రీకరిస్తున్నాం. 30 రోజుల పాటు బద్వేలు పరిసర ప్రాంతాల్లోను, ఇతర గ్రామాల్లోను షూటింగ్ చేస్తాం. ఆరు పాటలను రికార్డ్ చేశాం. ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పీసీ రెడ్డి మాట్లాడుతూ -‘‘మూడు తరాల కథతో ఈ సినిమా ఉంటుంది. తాత, తండ్రీకొడుకుల పాత్రలు ప్రధానంగా ఉంటాయి. కొడుకు పాత్రను రాజా, ఆయన తాతగా రంగనాథ్, తండ్రిగా భానుచందర్ చేస్తున్నారు’’ అని చెప్పారు. కథ, తన పాత్ర బాగున్నాయని రాజా అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సంగీతం: ప్రమోద్‌కుమార్.