తాత-తండ్రి-మనవడి కథ | Grandfather - father - different story | Sakshi
Sakshi News home page

తాత-తండ్రి-మనవడి కథ

Published Sun, Mar 30 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

తాత-తండ్రి-మనవడి కథ

తాత-తండ్రి-మనవడి కథ

ప్రజాసంక్షేమానికై తపించే తండ్రి. ఆ బాటలోనే పయనిస్తూ... ఒక వైద్యునిగా, జన హృదయనేతగా ప్రజల హృదయాల్లో చెరగని సంతకాన్ని లిఖించిన తనయుడు. తాత, తండ్రి.. వీరినే ఆదర్శంగా తీసుకొని నవ శకానికి నాంది పలికిన మనవడు. ఈ ముగ్గురి జీవితాలే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా హీరోగా నటించిన ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రధారులు. పరిణిక, మమతా రావత్ కథానాయికలు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.
 
 ఈ సందర్భంగా  నిర్మాత మాట్లాడుతూ -‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాకథ  ఏ నేతకు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పల్లెటూరి చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన పి.చంద్రశేఖరరెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: వల్లూరి శకుంతలమ్మ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement