PC Reddy
-
పీసీ రెడ్డి మృతికి ఆచార్య సీఎంకే రెడ్డి సంతాపం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి(ఆచార్య సీఎంకే రెడ్డి) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘నెల్లూరు జిల్లాలో జన్మించి పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేధావి చంద్రశేఖరరెడ్డి. ఈయన దర్శకత్వం వహించిన 93 చిత్రాల్లో 55 చిత్రాలు కృష్ణగారితోనే తీయడం విశేషం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ
Supers Star Krishna Condolence To Director Death: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు. -
పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
విద్యార్థినులకు నగదు పురస్కారాలు అందజేసిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గత విద్యార్థునులకు ఆర్థిక సాయం అందిస్తున్న జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన పీసీ రెడ్డి ట్రస్టు 17వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ పీసీ రెడ్డి ఉదారతను చాటుకుంటున్నారని కొనియాడారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జస్టిస్ పీసీ రెడ్డి పదవీ విరమణ అనంతరం ట్రస్టు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని సుభాషణ్‌రెడ్డి అన్నారు. అలాగే మహిళాభివృద్ధికి ఆయన కృషి గర్వకారణమని, అందరూ జస్టిస్ పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఇలాంటి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు జస్టిస్ పీసీ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు మద్దాలి ఉషా గాయత్రి నిర్వహించిన ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పీసీ రెడ్డి కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న విద్యార్థులు వీరే న్యాయ శాస్త్రంలో పి.వాసవి, కె.సునీత, కె.లక్ష్మీ తులసి.. వైద్య శాస్త్రంలో కె.చంద్రకళ, పి.కార్తి, చింతా జీవన, షేక్ షీపా సుల్తానా, టి.శివ ప్రియాంక.. సాంకేతిక శాస్త్రంలో సి.క్రిష్ణ నివేదిత, పి.సాయిదివ్య, బి.మమత, సుగ్గం జానకి, గీత తరంగిణి, ఆర్.సౌమ్య, పి.సాయి చేతన, పి.సుజాత.. ఆర్ట్స్‌లో పి.కావేరి.. క్రీడల్లో పి.కీర్తి.. కళల్లో టి.గౌరీ ప్రియ. -
జగన్నాయకుడొస్త్తున్నాడు!
మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి.