‘సేవాదాస్‌’లో నటించడం గర్వంగా ఉంది: సుమన్‌, భానుచందర్‌ | Suman And Bhanu Chander Talk About Sevadas Movie | Sakshi
Sakshi News home page

‘సేవాదాస్‌’లో నటించడం గర్వంగా ఉంది: సుమన్‌, భానుచందర్‌

Published Sun, Mar 13 2022 4:44 PM | Last Updated on Sun, Mar 13 2022 4:44 PM

Suman And Bhanu Chander Talk About Sevadas Movie - Sakshi

సీనియర్  హీరోలు సుమన్​, భానుచందర్​ కీలక పాత్రలు పోషించిన బహుభాష చిత్రం 'సేవదాస్'​. శ్రీశ్రీ హథీరామ్​ బాలాజీ క్రియేషన్స్​ పతాకంపై ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కెపీఎన్​ చౌహాన్​, ప్రీతి అస్రాని, వినోద్​ రైనా, రేఖా నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ని షురూ చేసింది. తాజాగా సీనియర్‌ హీరోలు సుమన్‌, భానుచందర్‌తో పాటు మూవీ టీమ్‌ అంతతా మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ‘సేవాదాస్‌’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్’ చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "సేవాదాస్" సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు.

నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ... "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement