ప్రత్యేక పాత్రలో... | In particular the role of | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాత్రలో...

Published Sat, Jun 20 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ప్రత్యేక పాత్రలో...

ప్రత్యేక పాత్రలో...

ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ సమాజంలోని అవినీతిపై ఎలా యుద్ధం చేశాడనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘రుద్ర ఐపీఎస్’. అంజన్‌కుమార్ చెరుకూరి దర్శకత్వంలో అజిత్ క్రియేషన్ పతాకంపై రాజ్‌కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది.
 
 కీర్తన పొదువాల్ కథానాయిక. ప్రత్యేక పాత్రలో భానుచందర్ నటిస్తున్నారు. వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అంజన్‌కుమార్ చెప్పారు.
 
 నిజాయతీ గల రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నానని భానుచందర్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్. మూర్తి, సమర్పణ: టి.కృష్ణవేణమ్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement