![Powerful Police movie release in December - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/police.jpg.webp?itok=HHZNpLSd)
సీహెచ్‌వీ సుమన్ బాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్ ’. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై ఈ మూవీ రూపొందుతోంది. సుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘చట్టం ఎవరి చుట్టం కాదు. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్ ’. అందరూ ఆలోచించే కథ, కథనం ఉంటుంది. ఆగస్ట్ 15న మా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. డిసెంబరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ పులిగిల్ల, కెమెరా: గణేష్, లైన్ ప్రోడ్యూసర్: అబ్దుల్ రెహమాన్ .
Comments
Please login to add a commentAdd a comment