Powerful Police
-
పవర్ఫుల్ పోలీస్
సీహెచ్‌వీ సుమన్ బాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్ ’. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై ఈ మూవీ రూపొందుతోంది. సుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘చట్టం ఎవరి చుట్టం కాదు. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్ ’. అందరూ ఆలోచించే కథ, కథనం ఉంటుంది. ఆగస్ట్ 15న మా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. డిసెంబరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ పులిగిల్ల, కెమెరా: గణేష్, లైన్ ప్రోడ్యూసర్: అబ్దుల్ రెహమాన్ . -
ఇది పోలీసోడి పవర్!
అతను పవర్ఫుల్ పోలీస్... బెత్తంతో క్రిమినల్స్‌ను చిత్తక్కొడుతుంటాడు. టీచర్లా బెత్తంతో కొట్టడం ఏంటి? లాఠీ ఏమైంది అనుకుంటున్నారా? మరదే వెరైటీ. మాస్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘తెరి’ట్రైలర్లోనే ఆయన అలా బెత్తంతో కొడుతూ, కనిపిస్తారు. తమాషా ఏంటంటే... ఇతగాడు ఇరగదీస్తుంటే, అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి వేరే చోట కూతురితో హ్యాపీగా జీవిస్తుంటాడు. అంటే... ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అది ప్రస్తుతానికి సస్పెన్స్. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ‘పోలీసోడు’ పేరుతో ‘దిల్’ రాజు, కలైపులి థాను ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, సహ- నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్. -
ప్రత్యేక పాత్రలో...
ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సమాజంలోని అవినీతిపై ఎలా యుద్ధం చేశాడనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘రుద్ర ఐపీఎస్’. అంజన్‌కుమార్ చెరుకూరి దర్శకత్వంలో అజిత్ క్రియేషన్ పతాకంపై రాజ్‌కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. కీర్తన పొదువాల్ కథానాయిక. ప్రత్యేక పాత్రలో భానుచందర్ నటిస్తున్నారు. వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అంజన్‌కుమార్ చెప్పారు. నిజాయతీ గల రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నానని భానుచందర్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్. మూర్తి, సమర్పణ: టి.కృష్ణవేణమ్మ.