
సాక్షి, చెన్నై: నటుడు చిన్ని జయంత్ కొడుక్కి సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన కై కొడుకుమ్ కై చిత్రం ద్వారా నటుడిగా చిన్ని జయంత్ సినీరంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలువురు ప్రముఖలతో కలిసి అనేక చిత్రాల్లో నటించాడు. కొన్ని చిత్రాలకు దర్శక నిర్మాతగానే బాధ్యతలను చేపట్టారు. చిన్ని జయంత్‌లో మంచి మిమిక్రీ కళాకారుడు ఉన్నాడన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న చిన్ని జయంత్‌కు సృజన్ జయ్ అనే కొడుకు ఉన్నాడు. (ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు)
ఇతను ఇటీవల జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 75వ స్థానంలో నిలిచాడు. అలా తొలి అటెంప్‌్టలోనే సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులైన సృజన్ జయ్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. నటుడు రజినీకాంత్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ చిన్ని జయంత్ కొడుకు సృజన్ జయ్ తన తల్లిదండ్రులను గర్వపడేలా చేసినందుకు తాను గర్వపడుతున్నానన్నారు. లాక్ డౌన్ లేకుంటే తాను నేరుగా ఇంటికి వెళ్లి ఆయన కొడుకును అభినందించే వాడినని రజనీకాంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment